జేడీఎస్ – కాంగ్రెస్ లో మొదలైన పదవుల కొట్లాట!

Tuesday, May 29th, 2018, 08:27:55 AM IST

కర్ణాటక ఎలక్షన్స్ లో ఎవరు ఊహించని విధంగా జేడీఎస్ అధినేత కుమారస్వామిని అదృష్టం వరించిన సంగతి తెలిసిందే. భారత జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకున్నప్పటికీ కాంగ్రెస్ – జేడీఎస్ లు ఏకమై అధికారాన్ని దక్కించుకున్నాయి. ఆ క్షణంలో బీజేపీకి అధికారాన్ని అందించకూడదని కాంగ్రెస్ జేడీఎస్ కంటే ఎక్కువ సీట్లు అందుకున్నప్పటికీ జేడీఎస్ కె సీఎం సీటును ఇచ్చేశారు. ఇక ఉప ముఖ్య మంత్రి పదవిని కాంగ్రెస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం జరిగిన కూటమిలో మంత్రి పదువులు ఎంపిక సమయంలో గోపడవలు రాకుండా ఉండవని బీజేపీ నేతలు ముందే చెప్పారు.

తప్పకుండా జేడీఎస్ – కాంగ్రెస్ లో గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయని తెలిపింది. అయితే ఇప్పుడు అదే నిజమైంది. ప్రస్తుతం ఇరు పార్టీల నేతల మధ్య మంత్రి పదవుల విషయంలో గొడవలు ముదురుతున్నాయి. సీఎం సిటు ఇచ్చి మిగతా మంత్రి పదవుల విషయంలో కాంగ్రెస్ పెత్తనం చెలాయిస్తోంది అనే తరహాలో కామెంట్స్ వస్తున్నాయి. ఇటీవల ఆర్థిక శాఖ మాంత్రి విషయంలో జేడీఎస్ – కాంగ్రెస్ నేతల మధ్య వివాదం తారా స్థాయికి చేరడం హాట్ టాపిక్ గా మారింది. జేడీఎస్ నేత కుమారస్వామి మాత్రం రూల్ ప్రకారం ఆర్థిక శాఖ మంత్రి తమ పార్టీ వారికే చెందాలని కాంగ్రెస్ నేతలతో చెబుతున్నారు.

డీల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో రీసెంట్ గా నేతలు చర్చలు జరిపారు. కాంగ్రెస్ నేతలు పట్టు వదలకపోవడంతో కొంత సమయం కావాలని పార్టీ చీఫ్ దేవగౌడ్ తో మాట్లాడిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదే విధంగా ఇక ఈ వివాదం అంత పెద్దదేమీ కాదని రెండు మూడు రోజుల్లో సెట్ అవుతుందని కుమారస్వామి చెబుతున్నారు. కర్ణాటకలో ప్రస్తుతం 34 మంత్రి పదవులు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం జేడీఎస్ కు 10 అందుతాయి. కాంగ్రెస్ మొత్తం 22 మంత్రి పదవులను తీసుకోనుంది.

  •  
  •  
  •  
  •  

Comments