ప‌త్తికొండ‌లో క‌దంతొక్కుతున్న వైసీపీ.. రికార్డు స్థాయిలో భారీ చేరిక‌లు..!

Thursday, January 31st, 2019, 01:03:19 PM IST

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌వేళ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతుంది. ఒక‌వైపు వ‌రుస‌గా వ‌స్తున్న జాతీయ మీడియా స‌ర్వేలు వైసీపీకే ప‌ట్టం క‌డుతుండ‌డంతో ఆ పార్టీ నేత‌ల్లో జోష్ విప‌రీతంగా పెరుగుతోంది. ఈ క్ర‌మంలో రికార్డు స్థాయిలో వైసీపీలో చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లువురు సిట్టింగ్ అండ్ మాజీ నేత‌లు వైసీపీలో చేరుతుండ‌గా, ఇప్పుడు తాజాగా క‌ర్నూలు జిల్లా ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి మ‌రో దెబ్బ పిడింది.

అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. బుధ‌వారం ప‌త్తికొండి నియోజ‌క వ‌ర్గంలో వైసీపీ నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు ఆధ్వర్యంలో కర్నూల్ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌రెడ్డి సమక్షంలో.. దాదాపు 500 మంది కాంగ్రెస్ నేత‌లు వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో కర్నూలు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్యతో పాటు తుగ్గలి, మద్దికెర, పత్తికొండ మండలాల నుంచి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు వందలాది మంది పత్తికొండకు చేరుకున్నారు. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి తేరుబజారు, నాలుగు స్తంభాలు, అంబేడ్కర్‌ సర్కిల్‌ మీదుగా వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరికి బీవై రామయ్య, కంగాటి శ్రీదేవి, ప్రదీప్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. దీంతో ఎన్నిక‌ల ముంచుకొస్తున్న త‌రుణంలో వైసీపీలో వ‌ల‌స‌లు పెరుగుతుండ‌డంతో ఆ పార్టీ మ‌రింత బ‌లం పుంజుకుంటుంద‌ని రాజకీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.