కేసీఆర్ పై గెలువకుంటే రాజకీయాలను వదిలేస్తా

Thursday, November 9th, 2017, 02:00:57 PM IST

తెలంగాణాలో అసలు రాజకీయ వివాదాలు ఇప్పటి నుంచి మొదలవుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట నిజమే అవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధికార పార్టీపై ప్రతి పక్షాలు మాటల తూటాలు పేల్చుతున్నాయి. అంతే కాకుండా ఎవరు ఊహించని విధంగా సవాళ్లను కూడా విసురుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణాలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అధికార టీఆరెస్ పై కొత్తగా విమర్శలు చేస్తోంది.

మొన్నటి వరకు అభివృద్ధి పనుల్లో లోపాలున్నాయని విమర్శలు చేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో యుద్దానికి రావాలని సవాల్ విసురుతున్నారు. రీసెంట్ గా అసెంబ్లీ లాబీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ తనదైన శైలిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఛాలెంజ్ విసిరారు. నల్గొండ నుంచి కేసీఆర్ పోటీ చేస్తే నాతో గెలవలేడు. ఆఖరికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా కనీసం డిపాజిట్లు కూడా దక్కవనే విధంగా కోమటి రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయాల్లో చర్చనీయాంశం మారింది. అంతే కాకూండా తాను గజ్వేల్ నుంచి కూడా పోటీ చేస్తానని చెబుతూ.. 50 వేల మెజారిటీతో తాను గాలేవకపోతే రాజకీయల నుంచి పూర్తిగా తప్పుకుంటానని చెప్పారు.

  •  
  •  
  •  
  •  

Comments