కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విహెచ్ !

Wednesday, January 31st, 2018, 04:59:39 PM IST

సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాపై ఆయన ఏ స్థాయిలో విమర్శలు చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నేతల్లో చాలా వరకు అధికార పార్టీపై విమర్శలు చేయడం తప్ప ఇతర విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు. కానీ విహెచ్ మాత్రం అటు రాజకీయాలనే కాకుండా సాధారణ విషయాలపై కూడా తనదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువగా కేసీఆర్ పై ఆయన విమర్శలు చేస్తూ చర్చనీయాంశంగా మారుస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే.. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన విహెచ్ మరోసారి టీఆరెస్ పాలనపై కౌంటర్లు వేశారు. రాష్ట్రంలో హత్యలు, అశాంతి పెరిగిపోయాయని దేశంలోనే తెలంగాణ హత్యలు జరిగే రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉందని ఇక మహిళలకు అయితే రక్షణ లేకుండా పోయిందని చెప్పారు. ఇటీవల వరుసగా రెండు రోజుల్లో ఏడు హత్యలు జరిగాయి. ఈ అరాచకాలను ఆపలేని సీఎంగా కేసీఆర్ కొనసాగుతున్నారని ఆరోపించారు. అంతే కాకుండా ప్రస్తుతం పరిస్థితులను కేద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. దీంతో ఒక్కసారిగా మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.