బ్రేకింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్.. బీజేపీలో చేరిన.. కాంగ్రెస్ మాజీ ఉప ముఖ్య‌మంత్రి భార్య‌…!

Thursday, October 11th, 2018, 02:51:04 PM IST

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రస్థాయికి చేరుకున్నాయి. ఇక తెలంగాణ‌లో అయితే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యాక అక్క‌డి రాజ‌కీయ వాతావ‌ర‌ణం హాట్ హాట్‌గా సాగుతోంది. ఈ నేప‌ధ్యంలో ముఖ్యంగా అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య జంపింగ్‌లు, జాయినింగ్‌లు ఊపందుకున్నాయి. అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ మాజీ ముఖ్య‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహం భార్య ప‌ద్మినీ రెడ్డి ప‌తాక శీర్షిక‌ల్లో నిలిచారు.
అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య‌నేత అయిన దామోద‌ర్ భార్య తాజాగా బీజేపీలో చేర‌డంతో తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక్క‌సారిగా హాట్ టాపిక్‌గా మారింది. ప‌ద్మినీ రెడ్డి ఈ గురువారం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షులు ల‌క్ష్మ‌ణ్‌, స‌మ‌క్షంలో బీజేపీ కండువా క‌ప్పుకున్నారు. అయితే దామోద‌ర్ మాత్రం ప్ర‌స్తుతం కాంగ్రెస్‌లోనే కీల‌క‌నేత‌గా ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆయ‌న‌కు మేనిఫెస్టో క‌మిటీ ఛైర్మ‌న్‌గా కీల‌క బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించారు.

దీంతో కాంగ్రెస్‌లో దామోద‌ర్ చ‌క్రం తిప్పుతుంటే ఆయ‌న భార్య మాత్రం బీజేపీలో చేర‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఇక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ద్మినీ రెడ్డి బీజేపీ త‌రుపున సంగారెడ్డి లేదా ప‌టాన్ చెరువు నుండి బ‌రిలోకి దిగ‌నున్నార‌ని తెలుస్తోంది. సంగారెడ్డి నియోజ‌క వ‌ర్గంలో కాంగ్రెస్ త‌రుపున జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున ఈయ‌నే బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక మ‌రోవైపు అధికారం టీఆర్ఎస్ పార్టీ నుండి అదే నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌భాక‌ర్ రావు బ‌రిలోకి దిగ‌నున్నార‌ని స‌మాచారం. ఈనేపధ్యంలో సంగారెడ్డి నియోజ‌క వ‌ర్గంలో బీజేపీ త‌రుపున ప‌ద్మినీరెడ్డి అయితే గ‌ట్టి పోటీ ఇస్తుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. అదే జ‌రిగితే సంగారెడ్డిలో త్రిముఖ‌పోటీ ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగ‌నుంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.