రాసి పెట్టుకోండి.. టీఆరెస్ కి 6 సీట్లు కూడా రావు: కాంగ్రెస్ నేత

Tuesday, March 13th, 2018, 09:02:03 AM IST

ఏపీ లో ప్రత్యేక హోదా గురించి రాజకీయ నాయకులు ఓ రేంజ్ లో పోట్లాడుతున్న సంగతి తెలిసిందే. కానీ తెలంగాణలో మాత్రం నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార పార్టీ టీఆరెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య ఎక్కువగా పార్టీలో ఉన్న సినియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేసిఆర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నారు.రీసెంట్ గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.

రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. ఇరవై లక్షల కోట్ల బడ్జెట్ లో రెండు లక్షల కోట్లు రైతులకు కేటాయించలేవా? అని కోమటి రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ఇటీవల కేసీఆర్ మోడీని ప్రశ్నించారు. ఈ రోజు మేము కేసీఆర్ ని అడుగుతున్నాం. తెలంగాణ బడ్జెట్ ఐదు లక్షల కోట్లు పెట్టారు. మొక్కజొన్న వరి పసుపుకు వంటి పంటలకు ధర పెంచాలని డిమాండ్ చేశారు. ఇక వచ్చే ఎలక్షన్స్ లో టీఆరెస్ కి 106 సీట్లు వస్తాయని చెబుతున్నారు. కానీ 6 సీట్లు కూడా రావు. ఇది రాసి పెట్టుకోండని కోమటి రెడ్డి తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments