భ‌ట్టి విక్ర‌మార్క‌: ఆద‌ర్శ‌పాల‌న అంటే ఇదేనా…?

Friday, March 15th, 2019, 09:40:57 AM IST

దేశానికే ఆద‌ర్శ పాల‌న మాది అని చెప్పుకుంటున్నారు. ఇదేనా ఆద‌ర్శ పాల‌న అంటే. ప్ర‌తి ప‌క్ష ఎమ్మెల్యేల‌ని పార్టీ ఫిరాయించేలా చేయ‌డ‌మేనా మీ నీతివంత‌మైన పాల‌న అని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క కేసీఆర్‌పై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌ను ప‌ర్టీ ఫిరాంచేందుకు ప్రోత్స‌హిస్తూ ఆద‌ర్శాలు వ‌ల్లిస్తున్న కేసీఆర్ త‌న నీచ సంస్కృతిని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్ప‌క‌నే చెప్పేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం లేకుండా చేయాల‌న్న కుట్ర‌లో భాగంగానే పార్టీ ఫిరాయింపుల్ని తెరాస ప్రోత్స‌హిస్తూ నీచ రాజ‌కీయాలు చేస్తోంద‌ని ఈ సంద‌ర్భంగా త‌న ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

కేసీఆర్ నీకు చీము, నెత్తురు, రోషం, పౌరుషం, రాజ్యాంగంపై గౌర‌వం వుంటే వెంట‌నే ఫిరాయింపుల‌ను ఆపాలి` అని హెచ్చ‌రించారు. అంతా బాగానే వుంది భ‌ట్టిగారూ వైఎస్ హ‌యాంలో ఇదే త‌ర‌హా ఆప‌రేష‌న్‌ని వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చేస్తే ప‌క్క‌నే వుండి చంక‌లు గుద్దుకున్నారు. అదే ఆప‌రేష‌న్ ఇప్పుడు మేము చేస్తుంటే నెత్తీనోరు బాదుకుంటూ నీతి, నిజాయితీ, రాజ్యంగం అంటూ గ‌గ్గోలు పెడుతున్నారు. మీలో వున్న నీతి, నిజాయితీ అప్పుడేం చేశాయి?. అస‌లు మీలో అవి వున్నాయా? లేవా? వుంటే క‌ళ్లు మూసుకున్నారా?. మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్య‌భిచార‌మా?. తెలంగాణ‌లో వుండి ఒక్క‌రోజు కూడా తెలంగాణ ఊసెత్తని నీవు కూడా వేదాలు మాట్లాడ‌టం సిగ్గుగా వుంది అని తెరాస నేత‌లు భ‌ట్టి విక్ర‌మార్క‌పై మండిప‌డుతున్నారు.