కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచాడు!

Saturday, September 15th, 2018, 06:58:08 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ నుండి పోటీ చేస్తే నా సీటు వదిలేస్తాన‌ని స‌వాల్ విసిరారు కాంగ్రెస్ నాయ‌కుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. తెలంగాణ వచ్చి ఉండకపోతే కేసీఆర్ గజ్వెల్ లో ఎమ్మెల్యే గా కూడా గెలిచేవాడు కాదని తీవ్రంగా విమ‌ర్శించ‌డం తేరాస వ‌ర్గాల్లో చ‌ర్చ‌కొచ్చింది. “సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్‌కి రా.. ఒక్కరూపాయి ఎన్నికలో పెట్టకుండా ఎన్నికలకు పోదామని ఒట్టు వేసుకుందాం. ఎవ‌రు గెలుస్తారో తేల్చుకుందాం“ అంటూ ఒంటేరు ఒంటికాలిపై లేవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది. 2001 లో కేసీఆర్, హరీష్ ఆస్తులు ఎంత ..? ఈ రోజు ఉన్న ఆస్తులు ఎంతో బయటపెట్టాలి. బ్రోకరిజం పుట్టింది కేసీఆర్ ఇంట్లో. అసలు సిసలైన బ్రోకర్ కేసీఆర్ అంటూ హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మ‌లో తిట్ల‌తో చెల‌రేగిపోయారు ఒంటేరు.

కేసీఆర్ ఇచ్చిన హామీల మీద, అవినీతి మీద ఎక్కడైనా చర్చకు సిద్ధమే. నువ్వు చర్చకు రాకపోతే చవట, దద్ధమవి.. అందులో డౌట్ లేదు అంటూ మీడియా ఎదుటే ఒంటేరు ఫైర‌వ్వ‌డం చ‌ర్చ‌కు తావిచ్చింది. కేసీఆర్‌ తెలంగాణ ద్రోహి .. ఎన్నికలో ఇచ్చిన ఏ ఒక హామీ నెరవేర్చలేదు. సాధారణ ఎన్నికలు వస్తే ఒడిపోతరనే భయం తోనే ముందస్తు ఎన్నికలకు వచ్చారని ఒంటేరు విమ‌ర్శించారు. అన్ని వర్గాల ప్రజాలను మోసం చేసిన ద‌గుల్బాజీ కేసీఆర్. ఎన్నికలో పోటీ చేయడానికీ అనర్హుడు. కేసీఆర్ నువ్వు మనిశివైతే,చీము నెత్తురు ఉంటే మాట మీద నిలబడాలి ఎన్నికలకు దూరంగా ఉండాలి అంటూ తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో ఒంటేరు అంతెత్తున లేవ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఓవైపు తెలంగాణ ఎన్నిక‌ల‌కు స‌న్నాహాలు సాగుతున్న వేళ అధికార‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కులు చెల‌రేగిపోతూ ఇలా తిట్టుకోవ‌డం రివాజుగా మారింది. అయితే ప్ర‌త్య‌ర్థిని తిట్టేప్పుడు మ‌రీ ఈ రేంజు ప‌ద‌జాలం ఉప‌యోగించ‌డం హ‌ర్షించ‌ద‌గిన‌ది కాద‌న్న విమ‌ర్శ‌లు ఒంటేరుపై వెల్లువెత్తుతున్నాయి. ఒంటేరు ప్ర‌తాప్‌రెడ్డి ఇదివ‌ర‌కూ తేదేపా నుంచి కండువా మార్చి కాంగ్రెస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments