టీడీపీతో పొత్తు.. కాంగ్రెస్ నేతల్లో అలజడి?

Friday, September 14th, 2018, 06:43:41 PM IST

తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం కాంగ్రెస్ తో జత కడుతుందని ఎవరు అనుకోలేదు. కానీ టీఆరెస్ ప్రభుత్వం ఆ రెండు వర్గాలను కలిసేలా చేసిందనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహాకూటమిగా ఏర్పడితేనే భవిష్యత్తులో ఇరుపార్టీలు బలాన్ని పెంచుకోవచ్చు. ఎదో ఒక విధంగా అధికార పార్టీని దెబ్బకొట్టాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన సాగిస్తోంది. అయితే అధిష్టానం పొత్తుపై సముఖతతో ఉన్నప్పటికీ లోకల్ నాయకుల మనస్సుల్లో మాత్రం కొంత అయిష్టతనే ఉన్నట్లు తెలుస్తోంది.

చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ తెలుగు దేశం పార్టీల మధ్య పొత్తు జనాల్లో తప్పుడు సంకేతాలను పంపుతుందని అవసరానికి కలిశారు అనే అపోహలు కలుగుతాయని సీనియర్ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో తెలిపినట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎన్నికల సమయం దగ్గరపడగానే కూటమిగా ఏర్పడటం ఎంతవరకు లాభాన్ని ఇస్తుందనేది చెప్పాలేమని ఒకవేళ అది కేసీఆర్ కే లాభం కలిగే అవకాశం ఉందనే వారు కూడా ఉన్నారు. రీసెంట్ గా పార్టీ నేతలతో చర్చించిన రాహుల్ నేతల అభిప్రాయాలూ అడగ్గా చాలా మంది ఈ విషయాన్నీ ప్రస్తావించినట్లు సమాచారం.

  •  
  •  
  •  
  •  

Comments