త్యాగానికి సిద్దమైన కాంగ్రెస్..?

Friday, September 21st, 2018, 08:37:56 AM IST

రాజకీయ నాయకులూ ఎంత కష్టపడినా ఎన్నికల సమయంలో పడే కష్టం వేరని చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీల నాయకులూ గెలవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. టీఆరెస్ పార్టీలో దాదాపు అందరికి పార్టీ టికెట్లు ఫిక్స్ అయ్యాయి. అధికారికంగా మరోసారి పార్టీ అధిష్టానం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే కేసీఆర్ ఊహించని విధంగా కొందరికి టికెట్ ఇవ్వకపోవడంతో అలక చెందారు. వారిని బుజ్జగించి ఇతర పదవులు ఇచ్చి సంతృప్తి పరిచేలా ప్లాన్ వేస్తున్నారు. కానీ దాదాపు 30 మంది ఆ పార్టీలో పార్టీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.

ఇకపోతే తెలుగు దేశం పార్టీ ఇతర వామపక్ష పార్టీలు కాంగ్రెస్ తో జత కడుతున్న సంగతి తెలిసిందే. మహాకూటమిగా ఏర్పాటై అధికార హోదాలో ముఖ్య పాత్ర పోషించాలని అనుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ వామపక్షాలను ఒప్పించడంలో విఫలమవుతోందని టాక్ వస్తోంది. ఓ వైపు తెలుగుదేశం పార్టీ 30 సీట్లు అడుగుతుంటే కోదండరాం టీజేఎస్ కూడా అదే తరహాలో డిమాండ్ చేస్తున్నారు. దీంతో పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. వీలైతే రాజ్యసభ సీట్లను త్యాగం చేసి అసెంబ్లీ సీట్లను తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని కథనాలు వెలువడుతున్నాయి. కానీ వామపక్షాలు మాత్రం రోజు చర్చలు జరుపుతున్నా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాయి. మరి వారి ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.