దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలివీస్తోందా?

Monday, October 22nd, 2018, 07:07:37 PM IST

2014 లో జ‌రిగిన ఎన్నిక‌లల్లో అనూహ్యంగా విజ‌యం ఆధించి అధికార‌పీఠాన్ని చేజిక్కించుకుంది భార‌తీయ జ‌న‌తాపార్టీ. న‌రేంద్ర మోదీని అతిగా న‌మ్మి ప్ర‌ధానిని చేసి ప‌ట్టాభిషిక్తుడిని చేసి దేశాన్ని పురోగామింప‌జేస్తాడ‌ని విశ్వ‌హిందూప‌రిష‌త్‌తో పాటు హిందూ మ‌త‌వాద సంస్థ‌ల‌న్నీ మోడీకి జై కొట్టాయి. కానీ జ‌రిగింది మాత్రం శూన్యం. అభివృద్ధి మాట దేవుడెరుగు దేశం వున్న సామాన్య జ‌నం ఆహాకారాల‌తో మ‌త ప‌ర‌మైన మూక హ‌త్య‌ల‌తో విసిగివేసారే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆడ‌వాళ్ల‌పై అత్యాచారాలు ఆగ‌డం లేదు. లైవ్‌లోనే బీజేపీకి చెందిన మంత్రులు, నాయ‌కులు మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్యంగా మాట్లాడుతూ దేశ సంప్ర‌దాయాల‌ను మంట‌గ‌లుపుతున్నారు.

బీజేపీ నాయ‌కులు ప‌రిస్థితి ఇలా వుంటే ఏదో మార్పు తెచ్చేస్తాడ‌ని ఊహించ‌ని విధంగా న‌రేంద్ర మోడీని ప్ర‌ధానిని చేస్తే నోట్ల ర‌ద్దుతో ఎంతో మంది సామాన్య ప్ర‌జ‌ల ఆత్మ హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యాడు. అంతేనా జీఎస్టీ, డీజిల్‌, పెట్రోల్ వంటి ధ‌ర‌లు పెగుతున్నా.. దేశం మొత్తం అస‌హ‌నంతో ఊగిపోతున్నా రోమ్ న‌గ‌రం త‌గ‌ల‌డుతుంటే నీరో చ‌క్ర‌వ‌ర్తి ఫిడేలు వాయించిన చందంగా మోడీ ప్ర‌వ‌ర్తించ‌డం రాజ‌కీయ విశ్లేష‌కుల్ని సైతం విస్మ‌యానికి గురిచేస్తోంది. ఈ నాట‌కీయ ప‌రిణామాల్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ కాంగ్రెస్ నేత‌లు చ‌క‌చ‌కా పావులు క‌ద‌ప‌డం మొద‌లుపెట్టారు. రాహుల్ గాంధీ ప‌ప్పుగా మార‌డంతో ప్ర‌ధాని అభ్య‌ర్థి త‌ను కాదంటూ, అలా మాట్లాడిన‌ వారిపై ఏఐసీసీ వ‌ర్గాలు చ‌ర్య‌లు తీసుకుంటాయిని చిదంబ‌రం తాజాగా స్ప‌ష్టం చేయ‌డం రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌కుండానే ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌నుకుంటున్నామ‌ని, ప్ర‌ధాని పీఠం నుంచి భాజ‌పాను దింప‌డ‌మే త‌మ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని , దేశ మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించ‌గ‌లిగే ప్ర‌భుత్వం, చిన్నారుల‌ను కాపాడే ప్ర‌భుత్వం, రైతుల‌ను ఆదుకుని దేశ స‌మ‌గ్ర అభివృద్ధికి పాటుప‌డే ప్రభుత్వం కోసం మేము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చిదంబ‌రం ప్ర‌క‌టించ‌డం మూడో ఫ్రంట్ ప ఆశ‌ల్ని చిగురింప‌జేస్తున్న‌ది. ఏది ఏమైనా ప్ర‌ధాన పార్టీల‌న్నీ బీజేపీని గ‌ద్దెదించే దిశ‌గా పావులు క‌దుపుతుండ‌టం, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ శుభ‌ప‌రిణామంగా రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.