జంప్ జిలానీ: వైకాపాలోకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ?

Monday, November 28th, 2016, 10:20:36 PM IST

YSRCP
తేదేపా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ దెబ్బ‌కు వైకాపా నేత‌లంతా తేదేపాలో చేరిపోయారు. దాంతో వైకాపా కుదేలైపోయింది. ఆ క్ర‌మంలోనే పార్టీ పున‌ర్‌వైభ‌వం కోసం జ‌గ‌న్ నానా పాట్లు ప‌డుతున్నాడు. ఇరుగు పొరుగు పార్టీల్లో ఛ‌రిష్మా ఉన్న నేత‌లు త‌మ పార్టీలోకి వ‌స్తే కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డ‌మే కాకుండా త‌గిన గుర్తింపు నిస్తాన‌ని హామీ ఇస్తున్నాడు. అప్ప‌ట్లో క‌ర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే ముర‌ళీకృష్ణ వైకాపాలో చేరిన సంగ‌తి విదిత‌మే.

లేటెస్ట్‌గా .. తూర్పుగోదావ‌రి- రాజ‌మండ్రికి చెందిన ఓ కీల‌క నేత వైకాపాలో చేరేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది.
దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కీల‌క అనుచ‌రుడైన తూ.గో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఇటీవ‌లే జ‌గ‌న్‌తో మంత‌నాలు సాగించారు. పార్టీలో చేరితే త‌గిన ఐడెంటిటీ ఇచ్చే బాధ్య‌త త‌న‌ది అని జ‌గ‌న్ హామీ ఇచ్చారుట‌. ఇప్ప‌టికే రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ర్త‌ల‌తో స‌ద‌రు నేత స‌మాలోచ‌న‌లు చేసి పార్టీ జంప్ చేసేందుకు అన్నీ రెడీ చేసుకుంటున్నారుట‌.