రేవంత్‌రెడ్డికి మొండి చెయ్యి!!

Tuesday, November 13th, 2018, 08:55:42 AM IST

రేవంత్‌రెడ్డి కి కాంగ్రెస్ అదిష్టానం మొండిచెయ్యి చూపించింది. త‌న వ‌ర్గానికి టికెట్‌లు కేటాయించాల‌ని చేసిన విన్న‌పాన్ని కాంగ్రెస్ పెద్ద‌లు పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. త‌ను కోరిన వారిలో సీత‌క్క‌కు మాత్ర‌మే టికెట్ కేటాయించి త‌మ పంతం నెగ్గించుకున్నారే కానీ రేవంత్‌ను ఖాత‌రు చేయ‌లేద‌ని తెలుస్తోంది. రేవంత్ టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరే స‌మ‌యంలోనే పార్టీ అదిష్టానానికి త‌న కోరిక‌ల చిట్టాను వినిపించాడ‌ట‌. త‌న‌కు పార్టీలో స‌ముచిత స్థానం, త‌న వ‌ర్గాల‌నికి కోరిన టికెట్‌లు, ప‌ద‌వులు ఇవ్వాల‌న్న‌ది రేవంత్ కోరిన‌ట్టు పార్టీ శ్రేణులే స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టాయి.

అయితే రేవంత్ అడిగిన‌దానికి భిన్నంగా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రించ‌డం అత‌నికి ఆగ్ర‌హాన్ని తెప్పిస్తోంద‌ని, త‌న మాట‌ను పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ ఖాత‌రు చేయ‌డం వెన‌క మ‌త‌ల‌బేంటో అర్థం కావ‌డం లేద‌ని కొంత మంది నేత‌ల ముందు రేవంత్ అనుమానం వ్య‌క్తం చేసిన‌ట్లు తెలిసింది. సీట్ల విష‌యంలో పీసీసీ నేత ఉత్త‌మ్‌కు, రేవంత్‌కు చెడింద‌ని ప్ర‌చారం తాజా సీట్ల ప్ర‌క‌ట‌న‌తో తేలిపోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. రేవంత్ త‌న అనుచ‌ర వ‌ర్గ‌మైన సీత‌క్క (ములుగు నియోజ‌క‌వ‌ర్గం), వ‌రంగ‌ల్ వెస్ట్ (న‌రేంద‌ర్‌రెడ్డి), నిజామాబాద్ రూర‌ల్ (అరికెల న‌ర్సారెడ్డి), ఆర్మూర్ (రాజారామ్ యాద‌వ్‌)కు కాకుండా ఆకుల ల‌లిత‌కు ద‌క్కింది. ఎల్లారెడ్డి (సుభాష్‌రెడ్డి), దేవ‌ర‌కొండ (బిల్లా నాయ‌క్‌), ఇల్లందు (హ‌రిప్రియ‌), సూర్య‌పేట (ప‌టేల్ ర‌మేష్‌రెడ్డి), చెన్నూరు బోడ జ‌నార్థ‌న్ల‌ కు టికెట్లు ఆశించాడు. అయితే తొలిజాబితాలోనే వారికి మొండి చేయి చూపించ‌డంతో రేవంత్ ఆధిప‌త్యాన్ని త‌గ్గించ‌డంలో భాగంగానే కాంగ్రెస్ ఇలా వ్య‌వ‌హ‌రించింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.