టీఆరెస్ ను దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ న్యూ ప్లాన్?

Tuesday, September 4th, 2018, 08:23:20 AM IST

తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ ప్రభుత్వం బలంగా పాతుకుపోయిందని ప్రతిపక్షాలకు బాగా తెలుసు. కానీ ఎంత బలమైన పార్టీ ఆయినా కూడా ఎదో ఒక ప్లాన్ తో దెబ్బ కొట్టవచ్చు అనే సామెత ను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచిస్తోంది. టీఆరెస్ పార్టీని ఓడించాలంటే మహాకూటమి తో ఎన్నికల్లో బరిలోకి దిగాలని కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. అతి నమ్మకానికి పోయి ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు చీలే అవకాశం ఉందని అందుకే వామపక్షాలు కలిసి పోటీ చేస్తే టీఆరెస్ పార్టీని ఓడించే అవకాశం ఉందని ఆలోచిస్తున్నారట.

టీడీపీ, సీపీఐ, సీపీఎం, జన సమితులను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలని కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమిలో బీజేపీ తప్ప అందరితోనూ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని టీ కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే సీపీఎం మాత్రం కాంగ్రెస్ తో కలవడానికి ఇష్టపడటం లేదు.

ఆ పార్టీ సీనియర్ నాయకులు కొందరు కాంగ్రెస్ తో పొత్తు అంటేనే ఆగ్రహానికి లోనవుతున్నారట. అయితే సీపీఎం పార్టీ తెలంగాణలో జనసేనతో పోటీ చేయాలని ఆలోచిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వామపక్షాల మద్దతును వదులుకోవద్దని సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతోంది. త్వరలోనే పార్టీ అధిష్టానం అన్ని పార్టీల నేతలతో సమావేశాన్ని నిర్వహించి నియోజకవర్గలకు సంబంధించిన సీట్ల ప్లానింగ్ ను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ మహాకూటమి వల్ల కేసీఆర్ ని ఎంతవరకు ఎదుర్కొంటారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments