కాంగ్రెస్ కు పట్టు దొరికిందా?

Thursday, April 5th, 2018, 08:39:13 AM IST

బీజేపీ పార్టీ దెబ్బకి ఒక్కసారిగా అపజయంతో కుప్పకూలిపోయిన కాంగ్రెస్ మళ్లీ రికవర్ అవుతుందా అని దేశ రాజకీయాల్లో ఇంతకుముందు ఒక చర్చ నడిచింది. కొన్ని రాష్ట్రాల్లో పార్టీ బలంగానే ఉన్నా కూడా మళ్లీ తన స్టామినాను చూపించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతుందో అనే సందేహం కూడా కలుగుతోంది. ఎలాగైనా నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవాలని పార్టీ అధిష్టానం చాలా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు మోడీ కూడా మరోసారి కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. ఆ పార్టీకి ఏ మాత్రం అవకాశాన్ని ఇవ్వకూడదు అనే ఆలోచనతో బీజేపీ పెద్దలు ముందుకు వెళుతున్నారు.

కానీ ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే బీజేపీకి ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ అందుతున్నాయని తెలుస్తోంది. చాలా కాలం తరువాత అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ స్థానాన్ని కాపాడుకోవడంలో బీజేపీ విఫలం అవుతుందా అనే సందేహం నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఏ మాత్రం కనికరం చూపకపోవడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు – కేసీఆర్ బీజేపీపై అసహనం వ్యక్తం చేయడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా బీజేపీకి దెబ్బ పడిందని అర్ధమవుతోంది. ఇది కాంగ్రెస్ కు బూస్ట్ లాంటిది.

ఇక లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పటికీ ఎంత మాత్రం చర్చలకు అవకాశం ఇవ్వకపోవడం చాలా దారుణంగా మారింది. ఇప్పటికే మోడీ ప్రభుత్వంపై చాలా రాష్ట్రాల్లో పార్టీలన్నీ రివర్స్ అయ్యాయి. మోడీ ప్రభుత్వాన్ని దించాలనే టార్గెట్ గా పెట్టుకున్నాయి. అయితే కాంగ్రెస్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. బీజేపీ వ్యతిరేఖ పార్టీలను తన వైపుకు తిప్పుకొని వచ్చే ఎలక్షన్స్ లో గెలవాలని అనుకుంటోంది. అందుకోసం రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీతో అలాగే పార్టీ పెద్దలతో ప్రత్యేక ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ అవకాశాన్ని వారు ఎంతవరకు ఉపయోగించుకుంటారో చూడాలి.