కాంగ్రెస్ ప్రచారాస్త్రాలు అవే..!

Sunday, September 7th, 2014, 03:23:28 AM IST


మెదక్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ పై ఎక్కు పెట్టేందుకు టీ-కాంగ్రెస్ పార్టీకి ప్రచారాస్ర్తాలు దొరికాయి. ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం కేసీఆర్ తీరునే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేదొకటి.. చేసేదొకటి.. మాట తప్పడంలో ఆయనను మించిన వారు మరెవరూ లేరు.. రాష్ట్రం రాక ముందు దళితుడిని సీఎం చేస్తానన్న ఆయన మాటలు ఇప్పటికీ ప్రజలు మరిచి పోలేదని కాంగ్రెస్ నేతలు ప్రతి ఎన్నికల ప్రచార సభలో గుర్తు చేస్తున్నారు. బంగారు తెలంగాణ నిర్మించుకోవాలని చెప్పి తండ్రి కొడుకులు టూర్లు చేస్తూ షికార్లు చేస్తున్నారు తప్పప్రజలకు ఇచ్చిన హమిలపై ప్రయత్నం చేయడం లేదని వారు అంటున్నారు. తెలంగాణ ఉత్యమంలో టీఆర్ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఏనాడైన పాల్గోన్నారా అని టి-పిపిసి నేతలు ప్రశ్నిస్తున్నారు.. తమ అభ్యర్ది పదేళ్ల రాజకీయ ఉద్యమంలో ఎటువంటి రాజకీయ ఆరోపణలు మచ్చలేని సునీతా లక్ష్మారెడ్డి పై ఏ ఒక్క అవనీతి ఆరోపణ రాలేదని ఇవే మాకు ఎన్నికల ప్రచారాస్త్రాలుగా ఉంటాయని వారంటున్నారు.

మెదక్ పార్లమెంట్ కు జరగుతున్న ఉన ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు తమ మాటల తూటాలను. విమర్శల దాడిని కాంగ్రెస్ నేతలు తీవ్రతరం చేస్తున్నారు. తెలంగాణను ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ యాడున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతున్నారు.. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన రుణమాఫీ, పెన్షన్ల పెంపు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం తమ పార్టీ 1957నుంచి పోరాటం చేసిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూపాయి ఆర్థిక సహాయం అందించలేదన్నారు. రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాలు ఇప్పటికీ అమలు కాలేదని మండిపడ్డారు. భద్రాచలంలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతున్నా సీఎం ఎందుకు పట్టించుకోలేదని, అఖిల పక్షం వేసి ప్రధాని, రాష్ట్రపతి వద్దకు ఎందుకు వెళ్లలేదని సీఎంను ప్రశ్నిస్తున్నారు.

మెదక్ ఉప ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వంలో చాలా కీలకమైన భారీనీటి పారుదల శాఖను మంత్రి హరీష్ రావు గాలికి వదిలేశారని, పెండింగ్ ప్రాజెక్టు ల నిధుల మంజూరు ,అనుమతుల విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుందని, మంత్రి నిర్ణయాల కోసం అధికారులు వేచి చూస్తున్నారని మెదక్ ఉప ఎన్నిక కోసం మంత్రి వర్గం అంతా మెదక్ లో తిష్ట వేయటం ఎంతవరకు సమంజసమని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు మంత్రి హరీష్ రావు సచివాలయానికి రారా అని ఎద్దేవా చేస్తున్నారు.