రివెంజ్ ప్లాన్ చేస్తోన్న కాంగ్రెస్.. టీఆరెస్ కు వచ్చే నష్టమేంటి?

Wednesday, March 14th, 2018, 01:15:31 AM IST

ఎప్పుడూలేని విధంగా తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ నాయకుల వివాదం తార స్థాయికి చేరింది. అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ నేతలు దురుసుగా ప్రవర్తించారని వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. మరో ఇద్దరి ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేశారు. అయితే ఈ విషయంపై టీ కాంగ్రెస్ నేతలు సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం చాలా కీలకమాణిక్ సీనియర్ నేతలు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.

జానారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే – ఎమ్మెల్సీల భేటీ అయ్యారు. అయితే ఈ కారణంగా కాంగ్రెస్ నేతలు సమయం చూసుకొని మూకుమ్మడిగిగా రాజీనామా చేయాలనీ అనుకుంటుండగా అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ నెల 27వరకు జరిగే సభల్లో కాంగ్రెస్ నేతలు ఉండరు అందువలన పార్టీకి చాలా నష్టం. ఇప్పుడు జనాల్లోకి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి తమ వైఫల్యం ఏమి లేదని చెప్పడం కరెక్ట్ అని కొంత మంది నేతలు అనుకుంటున్నారు. మరికొంత మంది మాత్రం రాజీనామా చేస్తే బెటర్ అనే విధంగా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.

అయితే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రాజీనామా చేస్తే కొంత లాభం ఉందనే టాక్ వస్తోంది. టీఆరెస్ పార్టీ సభను సక్రమంగా నిర్వహించకుండా ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీని బయటకు నెట్టివేసిందనే మచ్చ టీఆరెస్ కు పడుతుంది. ఆ విషయం జనల వరకు చేరేలా చేయాలనీ కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారట. కాంగ్రెస్ పెద్దలు జానా రెడ్డి – ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీని ఇప్పుడు ఏ విధంగా నడిపిస్తారు అనేది చర్చనీయంశంగా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments