తెలంగాణాలో కాంగ్రెస్ ఫెయిల్ అవుతోందా?

Thursday, September 13th, 2018, 08:39:36 AM IST

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా రాజకీయ వివాదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇకపోతే మెయిన్ గా ప్రతిపక్షాల కేసుల చిట్టాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి కి సంబందించిన కేసులు సీరియస్ గా మారాయి. అసలే ముందస్తు ఎన్నికలు సిద్దమవుతున్న కాంగ్రెస్ కు ఇదొక పెద్ద దెబ్బె అని చెప్పాలి.

అయితే ప్రతిపక్షాలు టీఆరెస్ ను గట్టిగా ఎదుర్కోలేకపోతున్నాయనే చెప్పాలి. మొన్నటివరకు వేరువేరుగా ఉన్న విపక్షాలు ఇప్పుడు ఏకమై ఉన్నప్పటికీ అక్కనుకున్నంత స్థాయిలో అయితే పోటీని ఇచ్చేలా లేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు భయం లేదంటూనే అసెంబ్లీ రద్దుపై పార్టీ వర్గాలు కోర్టును ఆశ్రయించడం ఆ తరువాత తీర్పు టీఆరెస్ కు మద్దతుగా రావడం జరిగింది. కాంగ్రెస్ విమర్శలు తప్ప అధరాలు చూపించడంలో విఫలమవుతుంది అనేది నిదర్శనంగా మారుతోంది. టీఆరెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన సభ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ చేయలేకపోయింది. ఆ విషయాన్నీ కూడా కాంగ్రెస్ పెద్దగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయింది.

ఎంతసేపు అధికార పార్టీపై విమర్శలు చేయడమే తప్ప తమ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేస్తుంది అనే విషయాలను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఇంకా ఎన్నికలకు సమయం ఎక్కువగా లేదు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాలి. పొత్తులపై ఇంకా ఒక రాజీకి రాలేదు. లోకల్ నాయకులను సిట్టింగ్ లీడర్లను బుజ్జగించి వేరొకరికి టికెట్టు ఇవ్వడమంటే చాలా కష్టమైనా పని. ఇదివరకే పలు చోట్ల కాంగ్రెస్ నేతలే మధ్యనే లుకలుకలు మొదలయ్యాయి. అలాగే పొత్తుల విషయంలో కూడా వివాదాలు చెలరేగుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ఆలోచన విధానం చాలా ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ పార్టీ సమర్ధవంతంగా రాణించలేకపోతుంది. ముందు రోజుల్లో అయినా మహాకూటమి ఫైనల్ నిర్ణయం అనంతరం కుదురుకుంటుందో లేదో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments