కాంగ్రెస్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థుల తొలి జాబితా ఇదే

Tuesday, November 13th, 2018, 09:21:41 AM IST

కూట‌మి కుమ్ములాట‌ల కార‌ణంగా గ‌త కొన్ని రోజులుగా వాయిదాప‌డుతూ వ‌స్తున్న కాంగ్రెస్ అభ్య‌ర్థ‌లు జాబితా ఎట్ట‌కేల‌కు సోమ‌వారం విడుద‌లైంది. తొలి జాబితాగా 65 మంది అభ్య‌ర్థుల్ని ఫ‌న‌ల్ చూస్తూ కాంగ్రెస్ అదిష్టానం తొలి జాబితాను విడుద‌ల చేసింది. ఇటీవ‌ల ముంద‌స్తు ఎన్నిక‌ల కోసం ర‌ద్ద‌యిన‌శాస‌న స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించిన 14 మంది ఎమ్మెల్యేల‌కు చోటు ద‌క్కింది. మాజీ ఎంపీలు పొన్నం ప్ర‌భాక‌ర్‌, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌, మ‌ల్లు ర‌విల‌కు చోటు ద‌క్కింది. అంతా అనుమానించిన‌ట్టుగానే పీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌కు మొండి చేయి చూపించారు.

కాంగ్రెస్ పార్టీలో నిర‌స‌న‌ల నేప‌థ్యంలో సోమ‌వారం ఉద‌యం నుంచి అర్థ‌రాత్రి వ‌ర‌కు తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. దీనికి తోడు ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీపై సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శ‌లు చేసిన విష‌యంపై కూడా సోమ‌వారం రాహుల్ చ‌ర్చించి ఉత్త‌మ్‌, కుంతియాపై సీరియ‌స్ అయిన‌ట్లు తెలిసింది. సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో జ‌రుగుతున్న జాప్యానికి రాహుల్ అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు కూడా వినిపిస్తోంది.

మిగిలిన 29 స్థానాల‌ను ఈ రెండు రోజుల్లో ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని సమాచారం. ముందు చెప్పిన‌ట్టుగానే కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీప‌డ‌నుంది. కూటమి స‌భ్యుల అభ్యంత‌రాలు, కాంగ్రెస్ ఆశావ‌హుల నుంచి ఎదుర‌వుతున్న నిర‌స‌న‌ల మ‌ధ్య తొలి జాబితాగా 74 మందిని ప్ర‌క‌టించాల‌నుకున్న కాంగ్రెస్ దానిలో మార్పులు చేసి 65 మంది ని తొలి జాబితాగా ప్ర‌క‌టించింది. త్వ‌ర‌లోనే మ‌రో 29 స్థానాల్ని ప్ర‌క‌టించి ప్ర‌చారాన్ని హోరేత్తించాల‌నే స‌న్నాహాల్లో కాంగ్రెస్ అదిష్టానం వుంద‌ని చెబుతున్నారు.