రాష్ట్రాన్ని 40ఏళ్ళు కాంగ్రెస్, 20ఏళ్ళు టీడీపీ పాలించాయి : మాకూ ఒక అవకాశం ఇవ్వండి

Saturday, July 28th, 2018, 03:40:23 AM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ లభించేలా అన్నివిధాలా వారికీ చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ప్రజల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఆయన ఇటీవల చేపట్టిన ప్రజా పోరాట యాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా జనసేన పార్టీలో చేరుతున్న కార్యకర్తలను ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నారు. ఈ సందర్భంగా నేడు భీమవరంలోని ఒక కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆయన, దేశానికి దేశ ప్రగతికి యువత ఎంతో కీలకమని, తమ పార్టీ స్థాపించింది యువ శక్తిని రాజకీయాల్లోకి తీసుకురావడానికి అని అన్నారు. ప్రస్తత నాయకులు రాష్ట్రానికి దొరికినంత దోచుకుని, ప్రజా సంక్షేమం మరియు వారి అభివృద్ధి గురించి కూడా పట్టించుకోకుండా వదిలేశారని మండిపడ్డారు.

యువతే అసలు తమ పార్టీకి ఇంధనమని ఈ సందర్భంగా అయన అన్నారు. దాదాపు 40 ఏళ్ళు కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు, ఒక 20 ఏళ్ళు టీడీపీకి అవకాశం ఇచ్చారు. ఈ ఒక్కసారి మా పార్టీకి అధికారం కనుక ఇస్తే మళ్ళి మళ్లి జనసేనే మాకు కావాలని మీరు అనుకునేలా పరిపాలన చేస్తామని అన్నారు. దేశ సంపద అంతా కూడా కొందరు బడా బాబుల దగ్గరే ఉండిపోతోందని, వున్నవాడు ఇంకా వున్నవాడుగా వుంటుంటే, లేనివాడు మరింత లేనివాడుగా తయారవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రాజకీయ పార్టీ అయితే అధికారాన్ని చేపడుతుందో ఆ పార్టీ పేద మరియు దిగువ తరగతి వారికీ కూడా అన్నిరకాల సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని, అప్పుడే వారు చేపట్టిన అధికారానికి పదవులకు సార్ధకత ఏర్పడుతుందని అన్నారు.

ఓవైపు మన రాష్ట్రంలో అన్ని రంగాలు, మరోవైపు యువత రైతులు సహా అందరూ కూడా ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే చాల వరకు ఇన్ని సమస్యలు వచ్చివుండేవి కాదని, చంద్రబాబు గారు మొదట్లో హోదా ఇప్పిస్తామని అన్నారు, ఆ తరువాత ప్రత్యేక ప్యాకెజీ పేరుతో అంతకుమించిన లాభం రాష్ట్రానికి వస్తోంది , అని చెప్పి అన్నివిధాలా రాష్త్ర ప్రజలను వంచించారని మండిపడ్డారు. ప్రజలు ఇవన్నీ గమనించాలని, రేపు మీరు ఓటు వేసేటపుడు ఏపార్టీకి ఓటేస్తే మనకు అన్నివిధాలా మేలు జరుగుతుంది అని ఆలోచన చేసి ఓటేయాలని మనవి చేశారు…..

  •  
  •  
  •  
  •  

Comments