డిఎస్ ను ‘కాంగ్రెస్’ లోకి రానివ్వమని అనలేదు: విహెచ్ వివరణ

Wednesday, July 11th, 2018, 08:58:26 PM IST


రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్న డీఎస్ తెలంగాణ విభజన సమయంలో టీఆరెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాదారుడిగా టీఆరెస్ లో ఆయన కీలక నేతగానే కొనసాగారు గాని అనుకున్నంతగా పదవులు దక్కలేదనేది వాస్తవం. అయితే ఇప్పుడు టీఆరెస్ నేతలు డీఎస్ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండడంతో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం వున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక డీఎస్ కాంగ్రెస్ లో చేరతారా? అనే విషయంపై ఇప్పటికి ఆ పార్టీ నేతలు పెద్దగా స్పందించలేదు. ఇక రీసెంట్ గా సీనియర్ కాంగ్రెస్ నేత హనుమంతరావు (విహెచ్) స్పందించిన తీరు కొంత ఆశ్చర్యాన్ని కలుగజేసింది. మొదట డీఎస్ పార్టీలో చేరితే తాము ఒప్పుకోమని కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడిచిపెట్టి టీఆరెస్ లోకి వెళ్లారని విహెచ్ మండిపడ్డారు. అయితే మళ్ళీ తరువాత ఆయన మాట మార్చడం హాట్ టాపిక్ గా మారింది. డీఎస్ ను మళ్ళీ కాంగ్రెస్ లోకి రానివ్వమని తాను అనలేదని ఆ విషయం కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని వారిదే తుదినిర్ణయమని వివరణ ఇచ్చారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య సైక్యత లేకపోవడం వల్ల త్వరలోనే రాహుల్ గాంధీ సమీక్ష నిర్వహించనున్నట్లు టాక్ వస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments