కాంగ్రెస్ రాజుగా రాహుల్ రెడీ.. నేడే పట్టాభిషేకం ?

Monday, December 4th, 2017, 08:43:45 AM IST

భారత జనతా పార్టీ రాజకీయా ఆలోచనల ముందు ఒక్కసారిగా పరాజయలతో సతమతమైన కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందా అని ప్రస్తుతం రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. అక్కడక్కడా కొన్ని రాష్ట్రాల్లో బలంగానే ఉన్నా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో మళ్లీ తన స్టామినాను చూపిస్తుందా అని ఒక సందేహం కూడా కలుగుతోంది. అయితే ఎలాగైనా నెక్స్ట్ ఎలక్షన్స్ లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా ప్రణాళికలను రచిస్తోంది. మరోవైపు బీజేపీ మోడీ కూడా కాంగ్రెస్ కు ఏ మాత్రం అవకాశాన్ని ఇవ్వకూడదు అనే ఆలోచనతో ముందుకు వెళుతున్నాడు.

అయితే కాంగ్రెస్ కూడా పార్టీ రూపురేఖలను మార్చి బలమైన నాయకుల చేతుల మీదుగా పార్టీని నడిపించాలని చూస్తోంది. ముందుగా ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ కి మొత్తం పార్టీ బాధ్యతలను అప్పగించాలని గత కొంత కాలంగా ఆ పార్టీ నేతలు అనుకుంటున్న సంగతి తెలిసిందే. రాహుల్ కూడా మోడీపై విమర్శలు చేస్తూ బీజేపీ అడ్డాలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చూస్తున్నాడు. మరి అతని ఆలోచనలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియదు గాని కాంగ్రెస్ పార్టీని మాత్రం బలంగా మారుస్తున్నాడని ఆ పార్టీ నేతలందరు భావిస్తున్నారు. ఇక ఆయనకు పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ కి పూర్తిగా బాధ్యతలని ఇవ్వాలని అందరు డిసైడ్ అయ్యారు.

అధ్యక్ష పదవికి ఎన్నికలను ఏర్పాటు చేస్తుండగా రాహుల్ కి పోటీగా ఎవరు నామినేషన్ వేయలేదు. ఈ రోజే నామినేషన్ కి చివరి తేదీ. అయితే రాహుల్ ఒక్కడే నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. దీంతో ఎవరు పోటీలో లేరు కాబట్టి రాహుల్ ఏకగ్రీవకంగా ఎన్నుకోబడతారు. కుదిరితే అధికారికంగా ఈ రోజే రాహుల్ పట్టాభిషేకం జరగనుంది. ఇప్పటికే రాహుల్ కి మద్దతుగా అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకుల నుంచి రాహుల్ కి మద్దతు లభించింది. ఆ పార్టీ సీనియర్ నేతలు సోనియాగాంధీ మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ – గులాంనబీ ఆజాద్ వంటి సీనియర్ నాయకులు రాహుల్ ని బలపరుస్తున్నారు. మరి రాహుల్ కాంగ్రెస్ రాజు అయిన తర్వాత ఆ పార్టీలో ఎలాంటి మార్పులు చేసుకుంటాయో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments