కాంగ్రెస్ సీనియర్ల చూపు వైసిపి వైపు?

Wednesday, July 11th, 2018, 03:40:10 AM IST

ఇప్పటికే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అన్ని ప్రధాన పార్టీల్లో వున్న నేతలు తాము టికెట్ ఆశించే పార్టీల్లో చేరాలని చూస్తుండడం సర్వ సాధారణం. అయితే కొందరు రాజకీయ విశ్లేషకులు చెపుతున్న సమాచారం ప్రకారం, రాబోయే ఎన్నికలకు టీడీపీలో చాలా మంది ఆశావహులకు సీట్లు దక్కవని, ఇప్పటికే పార్టీలోకి చేరికలు మరింత ఎక్కువయ్యాయని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్నాళ్ల క్రితం అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విషయమై ప్రధాని మోడీతో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయిందని, అందువల్ల ఆయన ఏపీలోని ప్రస్తుత నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలని నిలబెట్టాలని నిర్ణయించినట్లు చెపుతున్నారు. దానివల్ల కొందరు పార్టీని వీడే అవకాశం కూడా లేకపోలేదట. ఇక మరోవైపు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వున్న చాలా మంది సీనియర్ నాయకులు వైసిపి వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయట.

తెలంగాణాలో కొంతమేర బాగుంది కాంగ్రెస్, ఏపీలో మాత్రం చాల దిగువన ఉండడంతో ఆ పపార్టీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారు తిరిగి అందులోకి వెళ్లే అవకాశం చాల తక్కువని, ఎక్కువమంది సినియర్లు జగన్ వైపు చూస్తున్నారని, అదీకాక ప్రజలు నాడిని బట్టి చూస్తే కొంతవరకు జగన్ మేనియా కనపడుతుండడంతో వారు ఆ పార్టీవైపు వెళ్లాలని అనుకుంటున్నారట. ఇప్పటికే జగన్ ప్రజాసంకల్ప యాత్ర తరువాత ఆ పార్టీలోకి కూడా చేరికలు భారీగా పెరగడంతో జగన్ కూడా మంచి పట్టున్న నాయకులనే పోటీలో నిలబెట్టాలని చూస్తున్నారట. మరి అటువంటి సీనియర్లు ఏ మేరకు వైసిపిలో చేరి, పోటీ చేసి తమ సత్తా నిరూపించుకుంటారో తెలియాలంటే రాబోయే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడవలసిందే మరి….

  •  
  •  
  •  
  •  

Comments