2018 బిగ్ ఫైట్.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి రాజీనామా..!

Monday, November 19th, 2018, 10:31:45 AM IST

తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న‌ నేప‌ధ్యంలో అక్క‌డి ర‌జకీయాలు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌ ప్ర‌చారాన్ని వేగ‌వంతం చేసింది. ఇక మ‌రోవైపు మాహాకూట‌మిలో భాగంగా ఇప్ప‌టికే కాంగ్రెస్ అభ్య‌ర్ధుల విష‌యంలో మ‌ల్లాగుల్లాలు ప‌డి, నాలుగు జాబితాలుగా అభ్య‌ర్ధుల లిస్ట్‌ను ప్ర‌కిటించింది. మ‌హాకూట‌మిలో భాంగాగా తెలంగాణ‌లోని 119 స్థానాల‌కు గానూ, 94 స్థానాల్లో పోటీ చేయ‌నున్న కాంగ్రెస్ ఆదివారం అర్ధ‌రాత్రి ప్ర‌క‌టించిన నాల్గొవ జాబితాతో మొత్తం 94 మంది అభ్య‌ర్ధ‌లు లిస్ట్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ నేప‌ధ్యంలో టిక్కెట్ ద‌క్కుతుంద‌ని ఆశించిన చాలా మంది నేత‌లు, కాంగ్రెస్ ప్ర‌క‌టించిన జాబితాల్లో త‌మ పేరు లేక‌పోవ‌డంతో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు పార్టీని వీడేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నారు. తాజాగా దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి మంత్రివ‌ర్గంలో ప‌నిచేసిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత శంక‌ర‌రావు షాద్‌న‌గ‌ర్ నుండి టిక్కెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ ప్ర‌క‌టించిన మొద‌టి జాబితాలోనే షాద్‌న‌గ‌ర్ నుండి సి. ప్ర‌తాప్ రెడ్డి పేరు ప్ర‌క‌టించారు. అయితే తుది జాబితా ప్ర‌క‌టించే నాటికి త‌న పేరు ఉంటుంద‌ని ఎదురు చూసిన శంక‌రరావుకి కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది.

దీంతో ఆయ‌న తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ స‌మాజ్ వాదీ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజీనామా లేఖ‌నే పంపించిన శంక‌ర‌రావు.. మీడియాతో మాట్లాడుతూ… తనను బలిపశువును చేశారని.. పార్టీలో విధేయులకు చోటులేదని.. కాంగ్రెస్‌కు మూలస్థంభాలైన చెన్నారెడ్డి, వెంకటస్వామి కుటుంబాలకు పార్టీలో చోటులేకుండా చేస్తున్నారని శంక‌రావు ఆవేద‌న వ్యక్తం చేశారు. కాగా తాజాగా తెలంగాణ స‌మాజ్ వాదీ పార్టీ అభ్య‌ర్ధిగా శంక‌ర‌రావు షాద్‌న‌గ‌ర్ నుండి పోటీలో దిగ‌నున్నారు. ఇక మ‌రోవైపు కాంగ్రెస్ కీల‌క నేత ఏనుగు మనోహర్ రెడ్డి క‌రీంన‌గ‌ర్ నుండి వేముల‌వాడ టిక్కెట్ ఆశించ‌గా అత‌నికి కూడా కాంగ్రెస్ మొండి చెయ్యి చూపించింది. దీంతో ఆయ‌న కూడా ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఒకే రోజు ఇద్దురు కీల‌క‌మైన నేతలు పార్టీ మార‌డంతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తిగిలింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.