బండ్ల గణేష్‌కి ఊహించ‌ని షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. కాంగ్రెస్ తొలి జాబితా విడుద‌ల‌..!

Wednesday, October 10th, 2018, 06:50:08 PM IST

తెలుగు సినీ ప్ర‌పంచంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి భ‌క్తుడైన న‌టుడు, నిర్మాత అయిన బండ్ల గ‌ణేష్, రాజ‌కీయాల్లోకి వ‌స్తే జ‌న‌సేన‌లో చేర‌డం ఖాయ‌మ‌ని అంతా భావించారు. అయితే అంద‌రికీ ఊహించ‌ని షాక్ ఇస్తూ బండ్ల గ‌ణేష్ ఇటీవ‌ల కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఈ భ‌జ‌న మాస్టారు కాళ్ళు నేల‌పై నిల‌వ‌లేదు. దీంతో వ‌రుస‌గా న్యూస్ చాన‌ళ్ళ‌లో ఇంట‌ర్వ్యూలు ఇస్తూ.. బండ్ల గ‌ణేష్ అనే నేను అంటూ ఏకంగా ప్ర‌మాణ‌స్వీకారాన్ని కూడా చ‌దివి వినిపించారు. దీంతో ఆ ఇంట‌ర్వ్యూలు చూసిన‌ కొంతమంది రాజ‌కీయ అనుభ‌వం ఉన్న‌వారు ఇదేం ఖ‌ర్మ అని త‌లలు ప‌ట్టుకోగా.. చాలామంది సామాన్య ప్ర‌జ‌లు మాత్రం చాలా కామెడీగా ఉంద‌ని తేల్చేశారు.

అయితే ఇక్క‌డ అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. తెలంగాణలో కాంగ్రెస్ త‌రుపున‌ ఎన్నిక‌ల బ‌రిరో దిగే తొలి జాబితాని కాంగ్రెస్ తాజాగా విడుద‌ల చేసింది. ఆ జాబితా చూస్తే అందులో మ‌న భ‌జ‌న బాబు బండ్ల గ‌ణేష్ పేరు లేక‌పోవ‌డంతో ఒక్క‌సార‌గా షాక్ తిన్నాడు. బండ్ల గ‌ణేష్ స్థానికం షాద్‌న‌గ‌ర్.. అయితే కాంగ్రెస్ ప్ర‌క‌టించిన షాద్‌న‌గ‌ర్ అభ్య‌ర్ధుల జాబితాలో బండ్ల‌గ‌ణేష్ పేరు లేదు. షాద్‌న‌గ‌ర్ టికెట్ ప్ర‌తాప్ రెడ్డికి కేటాయిస్తూ కాంగ్రెస్ ఫైన‌ల్ చేసిన జాబితాను విడుద‌ల చేసింది. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌తాప్ రెడ్డి టీఆర్ఎస్ అభ్య‌ర్ధి అంజ‌య్య యాద‌వ్ చేతిలో ఓడిపోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ త‌రుపున అంజ‌య్య యాద‌వే బ‌రిలోకి దిగ‌నున్నారు.

అయితే షాద్ న‌గ‌ర్‌లో క్ర‌మంగా త‌న బ‌లాన్ని, ఉనికిని పెంచుకుంటూ వ‌స్తున్న ప్ర‌తాప్ రెడ్డి ప్ర‌జ‌లకు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అంజ‌య్య అయితేనే గ‌ట్టి పోటీ ఇవ్వ‌గ‌ల‌డ‌ని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. దీంతో సొంత అడ్డాలో త‌న‌కు టికెట్ ల‌భిస్తుంద‌నుకున్న బండ్ల గ‌ణేష్‌కి చేదు అనుభ‌వం ఎదురైంది. దీంతో ఈ భ‌జ‌న బాబు ఎక్క‌డి నుండి పోటీలో దిగుతారో అని అశ‌క్తిగా మారింది. అయితే ఫైన‌ల్ లిస్ట్‌లో అన్నా బండ్ల గ‌ణేష్ పేరు ఉంటుందో లేక కాంగ్రెస్ హ్యాండ్ ఇస్తుందో చూడాలి. ఏది ఏమైనా న్యూస్ చానళ్ళ‌లో నానా హంగామా చేసిన బండ్ల గ‌ణేష్‌కి టికెట్ రాక‌పోతే.. త‌నే ఒక సినిమా తీసుకొని..అందులో రాజ‌కీయ నాయ‌కుడిగా న‌టించి.. గెలిచి.. ప్ర‌మాణ‌స్వీకారం చేయాల్సిందే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి.