రాజ‌కీయవ‌ర్గాల్లో టాక్ ఆఫ్ ది బ్రేకింగ్.. రేవంత్ రెడ్డికి జ‌బ‌ర్ధ‌స్త్ షాక్ ఇచ్చిన కాంగ్రెస్..!

Friday, October 12th, 2018, 04:00:29 AM IST

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చాలా ఏళ్ళుగా తురుపుముక్క‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. ఓటుకునోటు కేసులో అడ్డంగా ఇరుక్కున్న త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌ధ్యంలో కాంగ్రెస్‌లో చేరిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని చేర్చుకోవ‌డ‌మే కాకుండా తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని కూడా ఇచ్చింది. దీంతో కొంత‌లోకొంత తేరుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ‌లో ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో.. కాంగ్రెస్ త‌రుపున ప్ర‌చారంలో మునిగితేలుతున్నారు.

అయితే ఇక్క‌డ అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే తాజాగా రేవంత్ రెడ్డికి కొత్త త‌ల‌నొప్పులు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల రేవంత్ రెడ్డి, అత‌ని బంధువుల ఇళ్ళ పై ఐటీ దాడులు జరిగిన విష‌యం తెలిసిందే. దీంతో ఒక‌వైపు ఐటీ దాడుల‌తో స‌త‌మ‌తం అవుతున్న రేవంత్ రెడ్డి.. మ‌రోవైపు టిక్కెట్ల విష‌యం పై పెద్ద‌పంచాయితీనే జ‌రుగుతోంది. రాజాకీయంగా త‌న‌వెంటే నిల‌చిన వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా టికెట్లు ఇప్పించాల‌ని రేవంత్ రెడ్డి తెగ పాట్లు ప‌డుతున్నారు.

ఇక అందులో భాగంగానే దేశ రాజ‌ధాని ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పెద్ద‌ల‌తో మంత‌నాలు చేస్తున్నారు. అయితే మ‌రోవైపు టికెట్ల ఎంపిక విష‌యంలో భక్త చరణ్ దాస్ ఆధ్వర్యంలో ఓ కమిటీ.. తెలంగాణ‌లో తిష్ట‌వేసి అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంది. అయితే ఈ నేప‌ధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌రెడ్డికి పెద్ద షాక్ ఇచ్చింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సీటును రేవంత్ రెడ్డి త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన వేం న‌రేంద‌ర్ రెడ్డికి ఇవ్వ‌మ‌ని కోర‌గా.. కాంగ్రెస్ లైట్ తీసుకుంద‌ని.. ఆ స్థానంలో నాయ‌ని రాజేంద‌ర్ రెడ్డి పేరును జాబితాలో చేర్చార‌ని స‌మాచారం.

అంతేకాకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చే ట‌ప్పుడు త‌న‌తో పాటు కాంగ్రెస్‌లో చేరారు సీత‌క్క. అయితే తీత‌క్క‌ ములుగు నియోజ‌క వ‌ర్గం నుండి సీటు ఆశింగా.. భ‌ద్రాచలం నుండి బ‌రిలోకి దించాల‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంద‌ట‌. దీంతో రేవంత్ రెడ్డి తీవ్ర‌మైన అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది. ఈ నేప‌ధ్యంలో మ‌రోసారి టికెట్ల విష‌యం పై కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ఒక నిర్ణ‌యానికి వ‌స్తార‌ని రేవంత్ వ‌ర్గీయుల నుండి ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డికి మాత్రం కాంగ్రెస్ అధిష్టానం పెద్ద షాకే ఇచ్చింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు