భాజపా గుట్టు రట్టు చేస్తాం.. సిద్దరామయ్య

Thursday, May 17th, 2018, 03:11:25 PM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రాన్నిఒకవైపు కుదిపివేస్తే, చివరికి ఆ రాష్ట్ర సీఎం ఎవరవుతారా అని అందరినీ అయోమయంలో పడేసింది. చివరి ఎన్నికల ఫలితాల విడుదల మేరకు భాజాపా 104 స్థానాలు సాధించగా కాంగ్రెస్ పార్టీ 78 స్థానాలు పొందింది. జేడీఎస్ మాత్రం 38 స్థానాలు సాధించి ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే భాజాపాకు ఎలాగైనా రాష్ట్రాన్ని అప్పగించద్దన్న ఉద్దేశంతో కాంగ్రెస్ జేడీఎస్ పార్టీకి సీఎం పడవని కట్టబెడతామని ఇద్దరం కూటమిగా మారుదాం అని కాన్హ్రేస్, జేడీఎస్ నిర్ణయించుకొని రాష్ట్ర గవర్నర్ దగ్గరకు వెళ్ళడం జరిగింది. అదే క్రమంలో ఇటు భాజాపా కూడా తాము అత్యదిక స్థానాలు సాధించామని తమకు తాము ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంటామని గవర్నర్కి విన్నవించుకోగా ఈ విషయమై గవర్నర్ 3 రోజుల సమయం తీస్కోని నిన్న భాజాపా కి మాత్రమే సీఎం సీటు ఎక్కే అర్హత ఉందని తేల్చి చెప్పాడు. అంటే కాకుండా 15 రోజుల సమయంలో భాజాపా బలనిరూపణ చేసి చూపించాలని కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర భాజాపా అధినేత యడ్యూరప్ప గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశాడు. దెబ్బకి అటు కాంగ్రెస్ నేతలు, ఇటు జేడీఎస్ నేతలు తెల్ల మొహం వేసారు.

భాజాపాకి అధికారం రావడం సహించలేని కాంగ్రెస్ నాయకులు ఈ రోజు భాజాపాపై, యడ్యూరప్పపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజాపా ర్యాజ్యాంగాని వ్యతిరేకంగా పనిచేస్తుందని, కర్ణాటక రాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన సిద్దరామయ్య ఆరోపణలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం యద్యురప్పపై కోర్టులో ఉన్న కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని, అవి క్లియర్ అవ్వకుండా రాష్ట్ర సీఎంగా ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. భాజాపా చేస్తున్న పనితీరుకు నిరసనగా విషాన్ సౌద ప్రాంతంలోని మహాత్మా గాంధీ విఘరం ఎదుట ఆందోళనకు దిగారు. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చట్ట విరుద్దమని. ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లి భాజాపా చేస్తున్న అన్యాయాలను, ఆకృత్యాలను బయట పెడతామని, భాజాప నిజస్వరూపాన్ని బహాయ పడేలా చూస్తామని అన్నారు. బయట ప్రపంవ్హం అనుకుంటున్నట్టు కుమారా స్వామిని సీవం చేయడం కోసమో లేక కాంగ్రెస్ గద్దె ఎక్కడంకోసమో ఈ ఉద్యమం చేయడంలేదని, భాజాపా చేస్తున్న ఆకృత్యాలు బయట పెట్టేందుకే ఈ ఉద్యమమని సిదరామయ్య తెలిపారు. మేము ఎవరి సపోత్రు లేకుండా ఏ విషయం గురించి అయినా పక్కా ఆధారాలతో లేకుండా లేమని. మాతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం భాజాపాకు 104 స్థానాలు మాత్రమే ఉన్నాయని, కానీ మాకు 117 స్థానాలు ఉన్నాయని, గవర్నార్ చెప్పినట్టుగా బలనిరూపణలో భాజాపా కచ్చితంగా ఓడిపోయి మళ్ళీ వెనుదిరిగి వస్తుందని వెల్లడించారు.