కాంగ్రెస్ సర్వేల బాట.. గతంలో చేసిన తప్పులు చేయరట!

Thursday, June 14th, 2018, 07:01:36 AM IST

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తోంది. అధిష్టానం పలురకాలుగా వ్యూహాలను సలహాలను ఎప్పటికప్పుడు రాష్ట్ర నేతలకు అందిస్తోంది. ఇక తెలంగాణాలో ప్రత్యేక రాష్ట్ర ఇచ్చిన తరువాత కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడం అందరిని కలవరపరిచింది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ టీఆరెస్ పార్టీని అంతగా ఎదుర్కోలేకపోతోంది. అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఈ సారి టి కాంగ్రెస్ నేతలు బలంగా నిర్ణయించుకున్నారు.

ముందుగా పార్టీలో కొన్ని మార్పులను చేయాలనీ అనుకుంటున్నారు. పార్టీలో విభేదాలు అంతర్గత పోరులకు ఎండ్ కార్డ్ పెట్టేయాలని అనుకుంటున్నారు. అలాగే సర్వేలు నిర్వహించి అభ్యర్థులను ఫైనల్ చేయాలనీ ఇటీవల నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఎవరికైతే ప్రజల నుంచి గట్టి నమ్మకం ఉందొ వారిని మాత్రమే నియోజకవర్గ స్థానాల్లో టికెట్లు ఇవ్వడానికి కొత్త తరహా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం రెండు సర్వేలను పరిగణలోకి తీసుకోనున్నారు. వచ్చే నెలలో టీపీసీసీ – ఏఐసీసీ వేర్వేరు సర్వేలు చేసి 119 నియోజకవర్గాల్లో గెలుపుగుర్రాలను ఎంపిక చేయనున్నారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను కొనసాగించి గతంలో చేసిన తప్పులను ఈ సారి చేయకూడదు అని కాంగ్రెస్ నేతలు ఫిక్స్ అయ్యారు.

  •  
  •  
  •  
  •  

Comments