కాంగ్రెస్ – టీడీపీల పొత్తు.. 15 అసెంబ్లీ ఒక ఎంపీ సీటు అఫర్?

Saturday, September 1st, 2018, 11:03:31 AM IST

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో పొత్తులతో ఏ పార్టీ పోటీ చేసే అవకాశం కనిపించడం లేదు. ముందు ముందు ఊహించని పరిణామాలు ఏమైనా జరగవచ్చేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ సంగతి అటుంచితే తెలంగాణాలో మాత్రం తప్పకుండా పొత్తుల వ్యవహారం గట్టిగా నడిచేలా ఉందని సమాచారం. ఎందుకంటే ఇక్కడ టీఆరెస్ పార్టీ ఎంత బలంగా ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని సీనియర్ రాజకీయ నాయకులూ క్లారిటీ ఇచ్చేశారు.

ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ టీఆరెస్ పార్టీని బలంగా ఎదుర్కోవడంలో విఫలమైంది. అయితే ఎలాగైనా సంకీర్ణప్రభుత్వమైన ఏర్పాటు చేయాలనీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో చేతులు కలపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ విషయంపై అనేక రకాల రూమర్స్ వచ్చినప్పటికీ ఇరు పార్టీల నుంచి ఏ విధమైన స్పందన లేకపోవడంతో తప్పకుండా కలిసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం టీడీపీకి పెద్దగా అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ కేవలం 15 సీట్లను మాత్రమే గెలుచుగలిగింది. అందులో చాలా వరకు గెలిచినా నేతలు ఇతరపార్టీలోకి వెళ్లిపోయారు. ఇక ఇప్పుడు టీడీపీలో కొనసాగుతున్న పలువురు సీనియర్ నేతలకు కాంగ్రెస్ అవకాశం ఇవ్వాలని చూస్తోంది.

సిట్టింగ్ స్థానాల్లో 15 అసెంబ్లీ సీట్లకు అంగీకారం తెలిపినట్లు టాక్ వస్తోంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ సిట్టింగ్ స్థానాల్లో కాంగ్రెస్ కు చెందిన మరికొంత మంది సీనియర్ నేతలు పోటీ చేయాలనీ అనుకుంటున్నారు. ఎక్కువగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లో సీట్లకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. టీడీపీ కూడా తెలంగాణలో పార్టీ మనుగడ కోసం ఒప్పుకోక తప్పడం లేదని తెలుస్తోంది. ఇకపోతే 15 అసెంబ్లీ సీట్లతో పాటు ఒక ఎంపీ సీటు ఇవ్వడానికి మాత్రమే టీ కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉందిని కథనాలు వెలువడుతున్నాయి. త్వరలో రాహుల్ గాంధీ సమక్షంలో ఇరు పార్టీల నేతలతో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

నేటిఏపి స్పెషల్ : టీవీల్లో అత్యధిక TRP రేటింగ్స్ అందుకున్న సినిమాలు!

  •  
  •  
  •  
  •  

Comments