హస్తం విడవబోయే గాలిపటం టీడీపీ !

Tuesday, October 30th, 2018, 03:00:10 PM IST

కాంగ్రెస్ ను తరిమికొట్టాలనే లక్ష్యంతో పుట్టుకొచ్చిన పార్టీ తెలుగుదేశం. అలాంటి పార్టీ ప్రస్తుతం తెలంగాణలో అదే కాంగ్రెస్ తో కలిసి మహాకూటమిలో భాగమై ముందస్తు ఎన్నికలకు దిగుతోంది. ఇలా పార్టీ పునాది ఉద్దేశ్యాన్ని కాలరాసి మరీ కాంగ్రెస్ తో చేతులు కలపడానికి ప్రధాన కారణం కేసిఆర్ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించడమే అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నా ఉందో లేదో కూడ తెలియని ఉనికిని నిలుపుకునేందుకే అసలైన కారణం.

క్రితంసారి బొక్క బోర్లాపడిన కాంగ్రెస్ కు ఈసారి తెలంగాణలో అనుకూల పవనాలు వీస్తున్నాయి. కొద్దిగా ఎక్కువ మొత్తంలోనే సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే చంద్రబాబు ఒకవేళ కూటమి గెలిస్తే నామినేటెడ్ పదవులు దక్కించుకుని తెలంగాణపై పట్టు నిలుపుకోవాలని ప్లాన్ వేశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం బాబుకు అంత సీన్ ఇచ్చేలా కనబడటం లేదు.

బాబు అల్లుకుంటున్నంత వేగంగా కాంగ్రెస్ అల్లుకోవడంలేదు. ఏ ముఖ్య నేతను కదిలించినా ఎన్నికల ప్రయోజనం కోసం మాత్రమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని, దానికీ పరిమితులున్నాయని, అన్నీ ముందే మాట్లాడుకున్నామని అంటూ ఈ స్నేహం ఎన్నికలు ముగిసే వరకే అన్నట్టు సంకేతాలిస్తున్నారు. పైగా తాము ఇచ్చిన స్థానాల్లోనే టీడీపీని పోటీ చేయమంటూ అల్టిమేటం ఇచ్చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ వ్యవహారాలన్నీ చూస్తుంటే కాంగ్రెస్ ను అడ్డం పెట్టుకుని తెలంగాణపై హవా చూపుదామనుకున్న బాబు ఆశ తీరకపోగా ఎన్నికలయ్యాక కాంగ్రెస్ కావాలని వదిలేసిన గాలిపటంలా టీడీపీ గాలికి పోయేలా కనిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments