గెలుపు గుర్రాలకే టికెట్లు !

Wednesday, October 10th, 2018, 12:12:22 PM IST

మహాకూటమి ఏర్పడి ఇన్ని రోజులు కావొస్తున్నా, ప్రధాన ప్రత్యర్థి టిఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినా కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల జాబితాని ప్రకటించలేదు. మహాకూటమికి పెద్దగా ఉన్న కాంగ్రెస్ పార్టీయే ఇలా అలసత్వంతో ఉండటంతో సీట్ల సర్దుబాటు కాక టీడీపీ, సిపిఐ, తెజసలు కూడ ఇంకా అభ్యర్థుల జాబితాని సిద్ద చేసుకోలేదు.

దీంతో కాంగ్రెస్ అధిష్టానం బాగా ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చిందట. ఎలాంటి సెంటిమెంట్లకు, పైరవీలకు తావివ్వకుండా కేవలం గెలిచే వారికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుందట. అందుకే గత ఎన్నికలో తమ పార్టీ తరపున గెలిచినవారు ఎవరు, తృటిలో ఓడిపోయినవారు ఎవరు, డిపాజిట్లు కూడ దక్కని వారు ఎంతమంది అనే లెక్కలు చూస్తున్నారట.

ఈ ప్రకారం గతంలో గెలిచినవారికి వారి స్థానాల్ని వారికే ఇవ్వాలని, ఇతర పార్టీల నుండి వచ్చిన బలమైన నేతలకు వారి స్థానాల్లోనే టికెట్ కేటాయించాలని ఫైనల్ డెసిషన్ కు వచ్చి టీడీపీ, సిపిఐ, తెజసలకు కూడ ఇతర అంశాలను పక్కనబెట్టి గెలిచే వారికే టికెట్లు అడగాలని సూచించారట. మరి కేసిఆర్ ను గద్దె దింపడమే లక్ష్యంగా పెటుకున్నపుడు ఇలాంటి కఠిన నియమాల్ని పాటించక తప్పదు కదా.