కాంగ్రెస్ శ్రేణులకు వణుకు పుట్టిస్తున్న మాయావతి..!

Monday, October 29th, 2018, 02:57:59 PM IST

గ‌త కొంత కాలంగా కాంగ్రెస్ కు మిత్ర‌ప‌క్షంగా వున్న బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ఇప్పుడు వ్య‌తిరేకంగా మార‌డం కాంగ్రెస్ వ‌ర్గాల్ని క‌ల‌వ‌ర‌పెడుతోంది. దీదీ కొత్త ఎత్తులు కాంగ్రెస్ కు త‌ల‌నొప్పిగా మారుతుండ‌టంలో ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. నిన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌తో దోస్తీకి సై అన్న మాయావ‌తి ఇప్ప‌డు నై అంటూ కాలుదువ్వుతోంది. దీనికి కార‌ణం కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్. పొత్తు కోసం ఇరు పార్టీలు బీఎస్పీ, కాంగ్రెస్ స‌మాలోచ‌న‌లు చేస్తున్న వేళ మాయావ‌తిపై బాంబు పేల్చి దీదీకి చిర్రెత్తు కొచ్చేలా చేశాడు దిగ్వ‌జ‌య్‌.

దీనింతో ఆగ్ర‌హించిన దీదీ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీని దేబురించాల్సిన ఖ‌ర్మ త‌న‌కు ప‌ట్ట‌లేద‌ని, ఉత్త‌ర ప్ర‌దేశ్‌తో పాటు రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల్లో ఒంట‌రిగానే పోటీకి దిగుతామ‌ని ప్ర‌క‌టించేసింది. ఇక్క‌డి నుంచే కాంగ్రెస్ వెన్నులో వ‌ణుకు మొద‌లైంది. ఆయా రాష్ట్రాల్లో బీఎస్పీ త‌మ‌తో క‌ల‌వ‌కుండా ఒంట‌రిగా పోటీ చేయ‌డం అంటే బీజేపీకి లాభం చేయ‌డ‌మే అని కాంగ్రెస్ వ‌ర్గాలు క‌ల‌వ‌ర‌ప‌డుతున్నాయి. ముఖ్యంగా వ‌సుంధ‌రారాజేపై ఎరుగుతున్న అసంతృప్తిని కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం, అక్క‌డ జెండా ఎగ‌రేయ‌డం క‌ష్టంగా మారే అవ‌కాశం వుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోనూ దీదీ ప్ర‌భావం భారీగానే వుండే అవ‌కాశం వుంద‌ని స‌ర్వేలు చెబుతుండటం కూడా కాంగ్రెస్‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఎలాగైనా దీదీని మ‌చ్చిక‌ చేసుకుని మ‌ళ్లీ త‌మ‌వైపు తిప్పుకుంటేనే ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కుతామ‌ని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. కానీ దీదీ వింటుందా? పొలిటిక‌ల్ రోమియో దిగ్విజ‌య్ ని క్ష‌మించి కాంగ్రెస్‌కు స‌పోర్ట్ చేస్తుందా? అంటే అది మిలియ‌న్ డాల‌ర్‌ల ప్ర‌శ్నే.

  •  
  •  
  •  
  •  

Comments