ప్రజాసేయస్సుకు కాంగ్రెస్ త్యాగాలకు ఎప్పుడూ సిద్దమే : మధు యాష్కీ

Tuesday, May 22nd, 2018, 02:15:21 AM IST


బిజెపి అభ్యర్థి యెడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణం చేయించిన గవర్నర్ వజూ భాయ్, తర్వాత సుప్రీమ్ తీర్పుతో యెడ్యూరప్ప అభ్యర్థుల బల నిరూపణ చేయలేకపోవడంతో రాజీనామా చేయించవలసి వచ్చింది. తదనంతరం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడంతో ఆ రెండు పార్టీలు కలిసి కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ముందస్తుగానే జాగ్రత్తపడి జేడీఎస్ తో పొత్తు కుదుర్చుకున్నారని జరిగిన పరిస్థితులను బట్టి చూస్తే అర్ధమవుతుంది. కాగా రెండురోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి ఎన్నాళ్లపాటు ఆ పదవి లో కొనసాగుతారనేది చాలామందిలో వున్న అనుమానం.

దీనిపై నేడు ఏఐసిసి కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ సహాయక ఇంచార్జ్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ, నిజానికి కుమారస్వామికి ముఖ్యమంత్రి పదవి తాము ఎప్పుడో చేపట్టమని చెప్పామని, అది కూడా కేవలం రెండున్నరేళ్లు వంటి షరతులు కూడా పెట్టలేదని అన్నారు. అయినా సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగానే ఆయనకు ఆ పదవి ఆఫర్ చేసినట్లు మధు యాష్కీ చెప్పారు. అంతేకాదు ఐదేళ్లపాటు అయన కొనసాగేలా సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలానే సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగేందుకు ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అయినా బిజెపి వంటి మోసపూరిత పార్టీని అణగదొక్కేందుకు కాంగ్రెస్ ఈ మాత్రం త్యాగం చేయకతప్పదని, అయినా తమ పార్టీ నేతలు ప్రజా శ్రేయస్సుకోసం ఎప్పుడూ సిద్ధమేనని ఆయన అన్నారు. బీజేపీ నేతల వలే తమ పార్టీ నేతలు అధర్మపాలన చేయరని, ప్రజలు అందించిన విజయాన్ని వారి అభ్యున్నతి, శ్రేయస్సుకే కాంగ్రెస్ ఉపయోగిస్తుందని ఆయన అన్నారు……

  •  
  •  
  •  
  •  

Comments