రవీంద్ర జడేజా భార్యపై కానిస్టేబుల్ దాడి!

Tuesday, May 22nd, 2018, 11:37:22 AM IST

ప్రమాదాలు అనేవి చెప్పి రావు. ఒక్కోసారి ప్రమాదం మనం తెలిసి చేసినా, లేక తెలియక చేసినా తప్పుకు శిక్ష నుండి తప్పించుకోవడం ఎంతటివారికైనా కుదరదు. నేడు ప్రముఖ ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య పై ఒక కానిస్టేబుల్ చేయి చేసుకున్నాడు. అనుకోకుండా జరిగిన ఒక చిన్న తప్పిదం వల్ల ఆమె, కానిస్టేబుల్ చేతిలో భంగ పడవలసి వచ్చింది. విషయం ఏమిటంటే, జామ్ నగర్ ప్రాంతంలోని సారు సెక్షన్ రోడ్ లో జడేజా భార్య రీవా కారులో వెళుతోంది. అయితే వున్నట్లుండి ప్రమాదవశాత్తు ఆమె బ్రేక్ వేయడంతో ఎదురుగా వున్న కానిస్టేబుల్ ద్విచక్రవాహనాన్ని బలంగా గుద్దుకుంది.

వెంటనే ఆగ్రహించిన కానిస్టేబుల్ కారులో వున్న రీనాని దుర్భాషలాడుతూ జుట్టుపట్టుకులాగి కొట్టాడని అక్కడి స్థానికులు చెపుతున్నారు. అయితే ఘటన అనంతరం అక్కడి స్థానికులు కానిస్టేబుల్ ని వారించడంతో తరువాత అతను రీనా ను వదిలివేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీస్ లు రీనాను ఘటన స్థలం నుండి ఇంటికి పంపించేశారు. తరువాత స్థానికులు ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ మ్యాచ్ లతో బిజీగా వున్న జడేజా తన భార్య పై జరిగిన ఈ ఘటనపై ఎలా స్పందిస్తారు అనేది తెలియాలంటే కొంత సమయం వేచిచూడాలి…..

  •  
  •  
  •  
  •  

Comments