మల్లీఫ్లెక్స్ లకు దెబ్బ పడింది.. 25 లక్షల జరిమాన!

Thursday, August 9th, 2018, 02:40:35 PM IST

ప్రస్తుతం థియేటర్స్ లలో తినుబండారాలపై అధిక ధరలు వసూలు చేస్తే చర్యలు తప్పవని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రలో కూడా అలాంటి రూల్సే కంటిన్యూ అవ్వనున్నాయి. ఇటీవల విజయవాడలోని కొన్ని మల్టిప్లెక్స్ లకు వినియోగదారుల న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. భారీ జరిమానా విధిస్తు ఇక నుంచి రాష్ట్రంలో ఉన్న థియేటర్స్ లలో బయటి నుంచి వినియోగదారుడు తెచ్చుకునే తినుబండారాలను కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్ వంటి వంటిని అనుమతించాలని ఆదేశాలను జారీ చేసింది.

అసలు విషయంలోకి వస్తే.. గత ఏడాది ఏప్రిల్ నెలలో వినియోగదారులు మార్గదర్శక సమితి సహకారంతో కొందరు వినియోగదారులు మల్లీఫ్లెక్స్ థియేటర్లలో టిక్కెట్లు, ఆహార పదార్థాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. దీంతో చాలా నెలలుగా ఈ విషయంపై వాద ప్రతివాదనలు జరిగాయి. పీవీఆర్‌, పీవీపీ, ఎల్‌ఈపీఎల్‌, ఐమ్యాక్స్ , ట్రెండ్‌సెట్‌ మల్టీఫ్లెక్స్‌ థియేటర్లు ఈ కేసులో ఉన్నాయి. థియేటర్స్ యాజమాన్యాలును తూనికలు, కొలతల శాఖను న్యాయస్థానం ప్రతివాదులుగా చేర్చింది. ఇక చివరికి న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. ప్రతి థియేటర్ కు 5 లక్షల చొప్పున మొత్తంగా 25 లక్షల రూపాయల జరిమానాను విధించింది. ఇక వినియోగదారులకు అధిక ధరలకు తినుబండారాలను విక్రయించినందుకు గాను నష్టపోయిన వారికి 9 శాతం వడ్డీతో కలిపి పరిహారం చెల్లినచవలసిందిగా న్యాయస్థానం వివరణ ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments