ఏటీఎంలో శృంగారం..చూసి అవాక్కైన జనం..!

Sunday, February 26th, 2017, 07:39:14 PM IST


ఏటీఎంలో ఓ జంట పట్ట పగలే పాడుపనికి పాల్పడింది. పబ్లిక్ ప్లేస్ అయిన ఏటీఎం లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆ జంటని చూసిన జనం చీకొట్టుకున్నారు. ఇలాంటి చోట అలాంటి పనులా అంటూ మండిపడ్డారు. ఈ ఘటన మెక్సికోలోని అక్సాకా సిటీలో జరిగింది. అందరిలా డబ్బులు తీసుకోవడానికి లోపలి వెళ్లిన ఆ జంట అక్కడే ఉండిపోయారు. ఎంతకీ బయటకి రాకపోవడంతో సహనం నశించిన కొందరు డోరు తెరచి చూశారు. అంతే వారిద్దరూ అర్ధ నగ్నంగా పాడు పని చేస్తుండడంతో అవాక్కైయ్యాడు.

దీనితో అతడు వారి రాసలీలల్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్గా మారింది.జనం చూస్తుండడంతో వారిద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. అక్సాకా లో ఎడ్యుకేషన్ అథారిటీకి సమీపంలో ఓ ఏటీఎం ఉంది. వీరిద్దరూ అక్కడి టీచర్స్ అయి ఉంటారని భావిస్తున్నారు. కానీ వారి ఖచ్చితమైన వివరాలు తెలియయలేదు.