గోవా బీచ్ కు ప్రియురాలిని తీసుకుని వెళ్లాడు.. ఆ తరువాత..!

Friday, October 20th, 2017, 03:59:00 PM IST

ఇంటి నుంచి పారిపోయిన ప్రేం జంట గోవా బీచ్ లో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది. బల్జీత్ సింగ్ (25) అనే యువకుడు తన ప్రేయసి హరిందర్ కౌర్ (17) తో పాటు పంజాబ్ నుంచి పారిపోయి గోవా వచ్చారు. కోల్వా బీచ్ సమీపం లోని ఓ హోటల్ లో దిగిన వీరిద్దరూ కొన్ని రోజుల పాటు తిరిగారు.

కాగా తాజాగా వీరిద్దరూ శవాలై కనిపించడం కలకలం రేపుతోంది. కొల్వ బీచ్ లోని ఓ కొబ్బరి చెట్టుకు ఈ జంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాలని స్వాధీనం చేసుకున్న పోలీస్ లు పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. బంధువుల వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు విచారణ చేపడుతున్నారు. తమ కుమార్తె హరిందర్ కౌర్ ని బల్జీత్ సింగ్ కిడ్నాప్ చేసారని ఆరోపిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments