శృంగార సర్వే..20 శాతం భార్యాభర్తలకు వింత అలవాటు..!

Saturday, November 4th, 2017, 11:20:40 AM IST

మనిషి జీవితంలో భాగమైనది ఏదైనా సరే మితిమీరితే అనర్థదాయకంగా మారొచ్చు. భార్య భర్తల మధ్య శృంగారం కూడా ఓ భాగం. కానీ దీనిలో అనుసరిస్తున్న వింత పోకడలు జీవితాలని నాశనం చేస్తోందని ఓ సర్వేలో తేలింది. శృంగారం విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు తెలియక చాలా జంటలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ శృంగారంలో ఈ తరం జంటలు అనుసరిస్తున్న విధానాల విషయంలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 20 శాతం జంటలు తమ శృంగారాన్ని స్మార్ట్ ఫోన్ లో వీడియోలో తీసుకోవడానికి అలవాటు పడ్డట్లు నేరుగా ఒప్పేసుకున్నారు.

ఈ వింత పోకడ అతి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. సరదాకు చేసే ఈ పిచ్చి పని వలన వారితో పాటు మిగిలిన సమాజం పై కూడా ఈ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. పొరపాటున ఆ దృశ్యాలు నెట్ లోకి, సోషల్ మీడియాలోకి చేరితే డివోర్స్, సూసైడ్ లు, మనస్పర్థలు వంటి అంతర్థాలకు దారి తీసే అవకాశం ఉంది. దీనిపైనా ప్రముఖ కండోమ్ తయారీ సంస్థ మాన్ ఫోర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కూడా మొదలు పెట్టింది.