జగన్ కేసులో ఇందూ గ్రూప్ ఆస్తుల జప్తు

Monday, February 9th, 2015, 03:13:56 PM IST


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆస్తుల కేసులో ఇందూ గ్రుప్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలికంగా జప్తు చేసింది ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన 53 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేశారు. ఎస్పీఆర్‌ ప్రాపర్టీస్‌కు చెందిన 100 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలోని 153 ఎకరాల స్థలం, జీడిమెట్లలో వాల్లన్‌ ప్రాపర్టీస్‌కు చెందిన 3 కోట్ల విలువైన 2835 గజాల స్థలాన్ని జప్తు చేసింది.