అనంత‌పురం జిల్లా బ్రేకింగ్.. వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్.. ఎందుకో తెలిస్తే..?

Wednesday, October 10th, 2018, 12:12:20 PM IST

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం తీవ్ర‌స్థాయిలో వేడెక్కింది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో అధికార, ప్ర‌తిప‌క్షాలు నువ్వా-నేనా అనే విధంగా త‌మ‌దైన రాజ‌కీయాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించి అధికారంలోకి రావాల‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ‌త ఎడాదిగా పాద‌యాత్ర చేస్తున్నారు. మ‌రోవైపు గ‌త ఎన్నిక‌ల్లో అధికార టీడీపీకి మ‌ద్ద‌తు తెలిపిన జ‌న‌సేన కూడా ఈసారి ఎన్నిక‌ల బ‌రిలో ఒంట‌రిగా దిగ‌నుంది. అందులో భాగంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా యాత్రం చేస్తున్నారు. ఇక‌పోతే అధికారం టీడీపీ మాత్రం ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లు చేస్తుంది. దీంతో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రంజుగా సాగుతోంది.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత‌ నారా చంద్రబాబునాయుడు అనంత‌పురం జిల్లాలో పర్యటిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో అక్క‌డ ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌లు చేప‌ట్టే అవాకాశాలు ఉండ‌డంతో.. గొడ‌వ‌లు జ‌రిగే అవ‌కాశాలు కూడా ఎక్కువ‌గా ఉన్నాయ‌ని భావించిన‌ అనంత‌పురం జిల్లా పోలీసులు వైసీపీ నేత‌ల‌ను అరెస్టు చేయ‌డంతో అక్క‌డి వాతావార‌ణం ఒక్కసారిగా వేడెక్కింది. అంతే కాకుండా రాయ‌దుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో గ‌త ఎన్నిక‌ల్లో దొంగ‌హామీలు ఇచ్చి అధికారంలోకి వ‌చ్చాక ఒక్క హామీ కూడా పూర్తిగా నెర‌వేర్చ‌లేద‌ని ఈ మాజీ ఎమ్మెల్యే రామ‌చంద్రారెడ్డి మండిప‌డ్డారు. దీంతో పోలీసుల చ‌ర్య‌లు అనైతిక‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.