వామపక్షాల మధ్య లొల్లి.. టీఆరెస్ కు బలమేనా?

Monday, September 10th, 2018, 11:20:39 AM IST

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఎంత వివరించినా కూడా సమయం సరిపోదేమో. రోజులు గడుస్తున్న కొద్దీ నేతల మనసులు కూడా చాలా వరకు మారిపోతున్నాయి. విజయం సంగతి తరువాత.. అసలు ఎన్నికల బరిలో తమకు టికెట్టు లభిస్తుందా లేదా అనేది కొంద మంది నేతల్లో ఆందోళన కలిగించే అంశం. ఇక తెలంగాణాలో ప్రధాన వామపక్షలైన సీపీఐ – సీపీఎం అధిష్టానాలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ రెండు పార్టీలు కూడా టీఆరెస్ పార్టీకి వైఫ్యతిరేఖమే అయినప్పటికీ కలిసి పోటీ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఇకపోతే మరోవైపు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను ఎదుర్కోవడానికి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే మహాకూటమిని ఏర్పాటు చేసే విధంగా కాంగ్రెస్ ముందుకు వెళుతోంది. చివరకు భద్రశత్రువైన తెలుగుదేశం పార్టీతో కూడా చేతులు కలిపింది. టీఆరెస్ ను ఎదుర్కోవాలంటే అన్ని బీజేపీ – ఎమ్ఐఎమ్ మినహా అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లాలని కాంగ్రెస్ ఫిక్స్ అయ్యింది.

అయితే కమ్యూనిస్ట్ పార్టీల ఆలోచన వేరే విధంగా ఉందని తెలుస్తోంది. విడిగా పోటీ చేస్తే బలం తగ్గే అవకాశం ఉందని అది టీఆరెస్ కు బలమేనని కథనాలు వెలువడుతున్నాయి. సిపిఐ కాంగ్రెస్ నిర్మిస్తోన్న మహాకూటమిలో కలవాలని ఆసక్తి చూపుతుందట. సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశాన్ని ఎంత మాత్రం వదులుకోవద్దని పలువురు నేతలు డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక సీపీఎం ఆలోచన మాత్రం మరో విధంగా ఉంది. జనసేన తో కలిసి తెలంగాణ ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్రయత్నం చేస్తోంది.

ఇప్పటికే జనసేన పార్టీ సభ్యులతో చర్చలు జరిపిన ఆ పార్టీ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుంది.
ఎంతైనా కమ్యూనిస్ట్ పార్టీలకు పలు జిల్లాల్లో మంచి ఓటు బ్యాంకు ఉంది. అది కూడా ఐక్యతగా ఉంటేనే పార్టీకి కొన్ని స్థానాల్లో పట్టు దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఆ పార్టీలు విడిగా పోటీకి దిగడంతో ఓట్లు చీలే అవకాశం ఉంది. ఫలితంగా కారు స్పీడ్ పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments