కూటమికి సిపిఐ షాక్..చెప్పింది చెయ్యాల్సిందే..!?

Friday, November 9th, 2018, 04:48:11 PM IST

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుండగా ఒక పక్క తెరాస నేతలు వారి యొక్క అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.బీజేపీ కూడా అదే పనిలో ఉంది.కానీ మహా కూటమి విషయానికి వస్తే అన్ని పార్టీలకు సంబంధించి సీట్ల కేటాయింపులో ఇంకా రచ్చ నడుస్తూనే ఉంది,ఈ కూటమిలో పై చేయి టీకాంగ్రెస్ దే కావడంతో మిగతా పార్టీల వారు వీరు ఎన్ని సీట్లు కేటాయియిస్తే అవే ఎంచుకోవాల్సొస్తుంది.అయితే కొన్ని పార్టీలు కాంగ్రెస్ మాటకి ఓకే చెప్పినా మిగతా పార్టీల నేతలు మాత్రం గుస్సుమంటున్నారు.

ఇప్పుడు అదే కోవలోకి సిపిఐ పార్టీ కూడా చెందుతుంది.టీకాంగ్రెస్ వారికి కొన్ని సీట్లు మాత్రమే కేటాయించడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.తాము అడిగినన్ని సీట్లు ఇస్తేనే ఇక మీద నుంచి కూటమిలో కొనసాగుతామని లేకపోతె మీ దారి మీది మా దారి మాది అంటూ హెచ్చరికలు చేస్తున్నారు.మొత్తానికి సిపిఐ పార్టీ వారు మాత్రం మొదటి నుంచి 9 స్థానాలు కావాలని పట్టుబట్టారు కానీ దానికి కాంగ్రెస్ కుదరదు అని సంకేతాలు ఇవ్వగా ఈ సారి మాత్రం 5 స్థానాలు ఏవైనా పరవాలేదు కానీ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు,ఒకవేళ ఇవ్వని పక్షంలో స్వతంత్రంగా పోటీ చేసేందుకు అయినా సరే సిద్ధమే అని తెలుపుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments