టీడీపీ పార్టీకి ప్రజా సమస్యలు వద్దు..వైసీపీ పార్టీ అసలు ఎందుకుందో కూడా తెలీదు.

Thursday, September 20th, 2018, 05:17:02 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో గత కొద్దీ రోజులుగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసినదే.ఈ సమావేశాలకు అసలు ప్రతిపక్షం వైసీపీ పార్టీ వారు తాము హాజరు కావడం లేదు అని తెలిసిన వార్త కూడా నిజమే,ఆ భాద్యతను ఇప్పుడు బీజేపీ పార్టీ వహిస్తుంది అయితే ఈ సమావేశాలు పట్ల కమ్యూనిస్ట్ పార్టీల వారు తీవ్రంగా మండిపడుతున్నారు.సిపిఐ పార్టీకి చెందిన నాయకుడు రామకృష్ణ టీడీపీ మరియు వైసీపీ పార్టీల యొక్క వైఫల్యాల మీద మండిపడ్డారు.

మన రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశాలు ఏక పక్షంగా జరుగుతున్నాయి అని,ఐతే ఈ సమావేశాలులో మాత్రం ప్రజా సమస్యలను తుంగ లోకి తొక్కుతున్నారని ఆరోపించారు, అదే సమయంలో ప్రతిపక్ష వైసీపీ పార్టీ కోసం మాట్లాడుతూ అస్సులు ఆ పార్టీ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని,అసలు వారు ఎందుకన్నారో కూడా అర్ధం కావట్లేదు అని,అసలు ప్రజలు ఏం అనుకుంటున్నారో అని కనీస ఆలోచన లేకుండా అసంబ్లీ సమావేశాలను బాయికాట్ చేసి బయట తిరుగుతున్నారని మండిపడ్డారు.రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు కోసం పట్టించుకోవట్లేదని,రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు సీపీఎస్ విధానాన్ని రద్దు చెయ్యాలని కోరుతుంటే వాటిపై చర్చలు జరపకుండా అపహాస్యం చేస్తున్నారని విమర్శలు చేశారు.