భాజ‌పా, వామ‌ప‌క్షాలు స‌మాంత‌ర రైలు ప‌ట్టాలు!

Sunday, May 6th, 2018, 01:21:39 PM IST

”ఒక ప్ర‌త్యేకమైన సిద్ధాంతం ఉండి.. అదే బాట‌ను అనుస‌రించే పార్టీలు రెండే రెండు. అందులో ఒక‌టి వామ‌ప‌క్ష పార్టీలు, రెండోది భాజ‌పా. సిద్ధాంతపరంగా సీపీఐ, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయని, ఎప్పటికీ కలువవు” అని అన్నారు. తమ పార్టీలు సమాంతర రైలు పట్టాల్లాగా నడుస్తాయని గ‌డ్క‌రీ వేదిక‌ను అలంక‌రించిన ఓ స‌మావేశంలో నారాయ‌ణ ఆయ‌న ముందే అన‌డం సంచ‌ల‌న‌మైంది. దేశంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు బీజేపీ, వామపక్షాలకు మాత్రమే ఉంటారని తెలిపారు.

ఇదే వేదిక‌పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు నియంతృత్వ పొకడలకు ప్ర‌జ‌లు బ‌ల‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజకీయ వ్యవస్థ చాలా పవిత్రమైనదని అన్నారు. చెట్టు, చేమ, గొడ్డు గొద కంటే మనిషి జన్మ గొప్పదని, ఈ మానవ జన్మ సొసైటీని రాజకీయ వ్యవస్థను నడిపిస్తుందని చెప్పారు. రాజకీయ వ్యవస్థ పవిత్రమైనదని, తాను త్రికరణశుద్ధిగా నమ్ముతానని అన్నారు. ప్రస్తుత పరిస్థితి జర్నలిస్టులను ఏ ఛానల్, పత్రికల్లో ఉన్నారని అడగాల్సి వస్తుందని, కానీ అది వాళ్ల బతుకుదెరువు కోసం మారుతుంటారని తెలిపారు. కానీ రాజకీయ నాయకుల పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయిందన్నారు. సాయంత్రం రైలు ఎక్కినప్పడు ఒక పార్టీలో ఉంటామని, తెల్లారితే రైలు దిగినప్పుడు వేరే పార్టీలోకి మారుతున్నామని సెటైర్ వేశారు. ఈ మధ్య కాలంలో పార్టీలు మారడం చాలా సులువుగా మారిందని, రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు వామ‌ప‌క్ష పార్టీ అధినేత‌.

  •  
  •  
  •  
  •  

Comments