చంద్ర‌బాబు కొత్త కాపురం.. సీపీఐ నారాయ‌ణ సంచ‌ల‌నం..!

Tuesday, November 13th, 2018, 11:40:18 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పై సీపీఐ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యుడు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. చంద్ర‌బాబుకు అవ‌స‌రం అయితే ఎవ‌రితో అయినా పొత్తు పెట్టుకుంటాడ‌ని.. అదే అవ‌స‌రం లేక‌పోతే త‌న‌దైన శైలిలో పొగ పెట్టి మ‌రీ క‌ట్ చేస్తాడ‌ని.. అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు చంద్ర‌బాబు బ్రాండ్ అంబాసిడ‌ర్ అని.. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎప్పుడు ఎవ‌రితో కాపురం చేస్తాడో చెప్ప‌డం చాలా క‌ష్ట‌మ‌ని సీపీఐ నారాయాణ వ్యాఖ్య‌లు చేశారు.

కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఎన్ని రోజులు కొన‌సాగుతుందో తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు అయిపోయాక తేలుతుంద‌ని.. వీరి పొత్తు పై ఏపీలో మాత్రం ఇప్ప‌టికే తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌ని.. ఈ క్ర‌మంలోనే అనేక మంది నేత‌లు కాంగ్రెస్‌ను వీడుతున్నార‌ని.. అలాగే టీడీపీ నుండి కూడా నేత‌లు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నారాయ‌ణ అన్నారు. ఇక ప్ర‌ధాని న‌రేద్ర మోదీ చేసిన నోట్ల ర‌ద్దుతో దేశ వ్యాప్తంగా చ‌నిపోయార‌ని.. ఆర్బీఐ పూర్తిగా మోదీ క‌బంద హ‌స్తాల్లో ఉంద‌ని నారాయ‌ణ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో నాడు యాభై రోజుల్లో తాను చేసిన‌ నోట్ల రద్దు వ‌ల్ల ప్రయోజనాలు లేకుంటే మోదీ తనని కాల్చి చంప‌మ‌న్నార‌ని.. దీంతో ఆయనను 24 సార్లు కాల్చి చంపాలంటూ నారాయ‌ణ‌ మండిపడ్డారు.