పవన్ మాతో కలిసి పనిచేస్తున్నది అందుకే : సీపీఐ నేత

Tuesday, April 10th, 2018, 02:55:49 PM IST

ప్రస్తుత రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సరికొత్త దారిని ఎంచుకున్న సంగతి తెలిసిందే. వామపక్ష పార్టీలతో కలిసి ఆయన నిర్వహిస్తోన్న కార్యక్రమాలు జనాల్లో మంచి ఆదరణను అందుకుంటున్నాయి. ఇకపోతే పవన్ తో కలిసి పనిచేయటానికి గల కారణాన్ని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. కడప జిల్లాలో సీపీఐ 26వ రాష్ట్ర మహాసభలు జరుగుతోన్న సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో పార్టీ నేతలు రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి రామకృష్ణ గారు ఎన్నికయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సిపిఐ నేతలు ఎలాంటి త్యాగాలకైనా ముందుంటారు. ప్రజల సంక్షేమం కోసమే ఈ పార్టీ నేతలంతా కట్టుబడి ఉన్నారు. అందుకోసమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమతో కలిసి పని చేస్తానని ముందుకు వచ్చారని తెలిపారు. పవన్ నిర్ణయం మాకు చాలా నచ్చిందని చెప్పారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, మోదీ హఠావో అనే నినాదంతో ముందుకు వెళతామని చెబుతూ.. ప్రత్యేక హోదాను ఇప్పుడు సాధించకుంటే మరెప్పుడు సాధించలేమని, ఇప్పుడు మా బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్రం కోసం పోరాడతామని రామకృష్ణ తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments