కాంగ్రెస్ ను ఇరకాటంలో పడేసిన సీపీఐ..!

Tuesday, November 6th, 2018, 10:11:43 PM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది, ఒక పక్క తెరాస ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ముమ్మరం చేసింది, మహాకూటమి మాత్రం ఇంకా సీట్ల పంపకం లెక్కలు తేలక తర్జన భర్జనలు పడుతుంది. దీంతో విసుగెత్తిన సీపీఐ పార్టీ తాము పోటీ చేయబోయే 9 స్థానాలు ఇవే అంటూ ప్రకటించేసింది. ఇన్నాళ్లు సిపిఐ తమకు గౌరవప్రదంగా 5 స్థానాలైన ఇవ్వమని అడుగుతూ వచ్చింది, కాంగ్రెస్ మాత్రం వారు గలవకపోయిన ఊరికే సీట్లు అడుగుతున్నారంటూ తీసి పడేసేది. అయితే ఆ పార్టీ సీనియర్ నేత ఒకే ఒక్క ప్రశ్న తో కాంగ్రెస్ నోరు మూయించే ప్రయత్నం చేసాడు.

సిపిఐ నారాయణ మాటాడుతూ ” తమ పార్టీ ఏ సీటు అడిగినా కాంగ్రెస్ ఓడిపోతారు అంటుంది, కాంగ్రెస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుస్తుందా, అలా అని రాసివ్వగలదా?”అంటూ సూటి ప్రశ్న వేశారు. నిజానికి ఈ ప్రశ్నకు కాంగ్రెస్ దగ్గర సమాధానం లేదు, అయితే సిపిఐ ఇలాంటి లాజిక్ ఉన్న ప్రశ్నతో ఎదురు తిరుగుతుందని కాంగ్రెస్ అసలు ఊహించలేదు. కాంగ్రెస్ ఆలస్యం చేయటం వల్లే సమయం వృధా అవుతుందని, ఏ స్థానాలు కేటాయిస్తారో తెలియకపోతే ప్రచారం ఎలా చేసుకుంటాం అంటూ సిపిఐ ప్రశ్నిస్తోంది. మొత్తానికి జనాలకు సైతం విసుగెత్తించిన మహాకుటమి సీట్ల పంపకంలో సీపీఐ భలే ట్విస్ట్ ఇచ్చింది.

  •  
  •  
  •  
  •  

Comments