భయంతో మంత్రి పరుగో పరుగు..

Thursday, September 22nd, 2016, 03:58:10 PM IST

raghunatha-reddy
ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖామంత్రి పల్లె రఘునాథ రెడ్డి కి సిపిఎం కార్యకర్తల నుంచి ఇబ్బందిని ఎదుర్కొన్నారు. అనంతపురంలో సిపిఎం నేత ఎమ్మెల్సీకి గేయానంద్ అనాథ పురం ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి పడక పెంపు, సిబ్బంది నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు.ఆయన దీక్ష చేసేది మంత్రి రఘనాథ రెడ్డి ఇంటి సమీపంలోనే.

రఘునాథ రెడ్డి వాహనం గేయానంద్ దీక్షా ప్రాంగణం సమీపం నుంచి వెళ్లడం సిపిఎం నేతలు గమనించారు.పల్లె క్రుని అడ్డుకున్న సిపిఎం కార్యకర్తలు ఆయన వాహనం దిగగానే వాగ్వాదానికి దిగారు. మూడురోజులుగా గేయానంద్ దీక్ష చేస్తున్నా పత్తినిచుకోక పోవడంతో పల్లె పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితో పల్లె రఘునాథ రెడ్డి ఇప్పుడు పరామర్శిస్తానంటూ బయలు దేరారు. మూడురోజులుగా పట్టించుకోని మంత్రి ఇప్పుడు నామ మాత్రపు పలకరింపులు బయలుదేరారని సిపిఎం కార్యకర్తలు ఆయనతో గొడవకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీనితో పరిస్థితి అదుపు తప్పుతోందని భావించిన పల్లె అక్కడినుంచి పరుగు లంఘించారట.దీనితో మధ్యలో పల్లె కలిచెప్పు రోడ్డ్డు డివైడర్ కు ఇరుక్కుపోయిందట. దీనితో అప్రమత్తమైన పోలీస్ లు సిపిఎం కార్యకర్తలను చెదరగొట్టి ఆయనను కారులో తరలించారు.