వైరల్ వీడియో : నాలుగు సెకన్లలో ప్రపంచ రికార్డు సృష్టించాడు!

Tuesday, May 8th, 2018, 07:19:07 PM IST


ప్రపంచంలోకెల్లా అత్యున్నతమైన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడం అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పాలి. అసామాన్యమైన తెలివితేటలు, శక్తీ, కృషి, పట్టుదల ఉంటేనే అటువంటి అరుదైన పుస్తకంలో మనపేరు లిఖించబడుతుని అనేది అందరికి తెలిసిన విషయం. అయితే నేడు ఒక యువకుడు తన పేరిట వున్న గత రికార్డును తానే బద్దలు కొట్టి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వివరాల్లోకి వెళితే, రూబిక్ క్యూబ్ అనేది మనకు అందరికి తెలిసిందే.

దానిని సక్రమంగా ఏరంగుకు ఆ రంగు పేర్చడం అంటే అంతసులువు అయిన విషయం కాదని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా కు చెందిన క్యుబెర్ ఫెలిక్స్ అనే యువకుడు మొన్న ఆదివారం మెల్బోర్న్ లో జరిగిన కంబోడియా కాంపిటీషన్లో నమ్మశక్యంకాని విధంగా కేవలం 4.22 సెకన్లలో రూబిక్ క్యూబ్ ను ఏరంగుకు ఆ రంగు అమర్చి అక్కడి వారందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కాగా ఇదివరకు ఫెలిక్స్ పేరుమీదనే వున్న రికార్డు 4.59 సెకన్ల రికార్డును తానే బద్దలు కొట్టాడు……

  •  
  •  
  •  
  •  

Comments