కలకలం రేపుతోన్న బుద్ధా వెంకన్నవ్యాఖ్యలు!

Thursday, May 3rd, 2018, 10:42:04 AM IST

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపించనుండడంతో ఆంధ్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు టీడీపీ, వైసిపి లు పరస్పర మాటల దాడులతో చెలరేగిపోతున్నాయి. కాగా ఇటీవల టీడీపీ నేత బుద్ధ వెంకన్న వైసిపి నేత జగన్ కుమార్తె పై చేసిన వ్యాఖ్యలు కొంత కలకలం రేపుతున్నాయి. విషయం లోకి వెళితే, రాజకీయ పరంగా, అలానే పార్టీ పరంగా ఎన్ని విమర్శలైనా చేయవచ్చు. కానీ అదే వ్యక్తిగత విమర్శలవైపుకు దారి తీస్తే మాత్రం, ఆ వ్యాఖ్యలు శృతి మించుతాయి. ఇటీవల కాంగ్రెస్ నాయకులూ కొందరు కూడా టిడిపి నేతల వ్యాఖ్యల శైలి మారాలని, ఎవరైనా వారిపై తప్పులను చూపి విమర్శిస్తే, అటువంటి వారిపై టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని చెప్పిన సందర్భాలు లేకపోవలేవు.

కాగా నిన్న టిడిపి ఎమ్యెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ జగన్ కు అధికారం మీద ద్యాస తప్ప ఏమి మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఆయనకు తెలియదన్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సమస్యలు రాజధాని నిర్మాణం ఇలా ప్రజలకోసం పాటుపడి దీక్షలు చేస్తుంటే, దానిని జగన్ వంచన దీక్షగా అభివర్ణించడం సరైనది కాదన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన విజయ్ సాయి రెడ్డి జగన్ పై వున్న కేసు లను ఎత్తివేయాలని ఆయనను అభ్యర్ధించారని, ఆ విధంగా వైసిపి, బిజెపి నేతల రహస్య లాలూచి ఎవరికి తెలియనిది కాదని అన్నారు.

ఇంతవరకు బానే వున్నా, అంతటితో ఆగకుండా జగన్ పెద్ద కుమార్తె హర్ష లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో చదువుతుందని, ఆమె వేల కోట్లరూపాయలు బ్యాంకు లకు ఎగనామం పెట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా ఇంట్లో వుంది చదువుకుంటుందని ఘాటైన విమర్శలు చేశారు. కాగా ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకాలమే సృష్టిస్తున్నాయి. సొంత పార్టీ నేతలే ఆయన్ను ఇలా వ్యక్తిగత దూషణలు, అలానే ఆడవారు, చిన్నపిల్లపై దూషణలు చేయడం సరైనది కాదని వారించినట్లు తెలుస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments